పుట:Maharshula-Charitralu.firstpart.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64

మహర్షుల చరిత్రలు


మును అపరార్కము ఋష్యశృంగ స్మృతిలోని దని పేర్కొన్నది.[1] స్మృతిచం దిక “అపి నాససా యజ్ఞోపవీతార్థాన్ కుర్యాత్, తదభావే త్రివృతా సూత్రేన" అన్నవచనము ఈ స్మృతిలోని దని పేర్కొన్నది. సమగ్రమగు స్మృతి యింకను లభింపవలసియున్నది.

ఋష్యశృంగుఁడు మహోత్తమతపశ్శాలియై శ్రీరామాదుల లోకమునకుఁ బ్రసాదించిన పరమపుణ్యాత్ముఁడు కావున నాతని నామస్మరణ మతిపవిత్రము.


  1. "పూర్వనష్టం తు యో భూమి మేకశ్చేదుద్దరేత క్రమాత్
    యథాంకంతు అతంతేన్యే దత్త్వాంశంతు తురీయతమ్.“