పుట:Maharshula-Charitralu.firstpart.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62

మహర్షుల చరిత్రలు


పిమ్మట పశిష్ఠమహర్షి యాదరమున దశరథుఁడు సరయూనదీ ప్రాంతమున నుత్తరముగా యజ్ఞశాల నిర్మింపించెను. అధ్వర సంభారము లన్నియు వెంటనే సమకూర్చెను. ఉత్తమోత్తములగు ఋత్విజులతోడను మహాత్ములగు మంత్రకోవిదులతోడను యజ్ఞము ప్రారంభమాయెమ. మంత్రులధిపునానతిని సర్వము నిర్వహించి యాగాశ్వమును విడిచిరి. సంవత్సరము గడచి తిరిగి వసంత మాసన్నమగు సరికి యజ్ఞాశ్వము సురక్షితముగా వచ్చి చేరెను. అంత దశరథుఁడు గురువరుఁడగు వశిష్ఠునిఁ బూజించి యజ్ఞభారము సమస్తముఁ బూనవలె నని ప్రార్థించెను. వశిష్ఠుని యాజ్ఞచే నతి కర్మఠులు నుత్తమోత్తములగు బ్రాహ్మణు లిష్టకాసహస్రములు దెచ్చిరి. కుండమండపవేది కాదులు, సత్రాగారములు , కాయమానములు మున్నగున వన్నియు నిర్మింపఁబడెను. జనకమహారాజు కేకయ రాజు సింధుదేశవిభుఁడు మున్నగువారాహూతులై వచ్చిరి. ధరణిసురు లెల్లరు విచ్చేసిరి. అంత వశిష్ఠప్రముఖులును భూసురోత్తములును ఋష్యశృంగునిఁ బురస్కరించుకొని యజ్ఞకర్మారంభమున విహిత క్రమమున నా యశ్వమేధమును సమాప్తి నొందించిరి. దశరథుఁ డనేక భూరిదక్షిణల బ్రాహ్మణోత్తముల సంతసింపఁ జేసెను. అంత దశరథుఁడు ఋష్యశృంగునిఁ జేరి " మహాత్మా! మీ దయావిశేషమున నధ్వరము పూర్తియైనది. ఇఁకఁదాముపుత్ర కామేష్టిఁ బ్రియమునఁ జేయుఁ" డని ప్రార్థించెను. ఋష్యశృంగుఁడు నంగీకరించి నానా మంత్రపూతముగా నాహుతుల నగ్నికిడుచుఁ బుత్త్రకామేష్టి చేయుచుండ నా పావనహోమాగ్ని వలనఁ బ్రాజాపత్యపురుషుఁడు దేవనిర్మితము నారోగ్యవర్ధనమును బుత్త్రోత్పత్తికరమును నగుపాయసము నొకపవిత్ర హేమపాత్రమునఁ దెచ్చి దశరథున కొసఁగి యంతర్హితుఁ డయ్యెను. ఋష్యశృంగుఁడు దశరథునిఁ బ్రియమారఁ బిలిచి యా పాయసము నాతని భార్యలకుఁ బంచి యిమ్మని చెప్పెను. ...................................................................................................................