పుట:Maharshula-Charitralu.firstpart.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఋష్యశృంగ మహర్షి

57


లోకమునకేఁగెను. ఆ బాలుఁడు మనుఁబెంటికి జన్మించినవాఁ డగుట నాతని నొసట నొక శృంగము నుండెను; దానిమూలమున నాతనికి ఋష్యశృంగుఁ డను నామము కలిగెను. అతఁ డచటఁ బెరుఁగు చుండఁగా నొకనాఁడు వింభాడకుఁడు చూచి దివ్యదృష్టివలన నాతఁడు తన ఫుత్త్రుఁడే యని గ్రహించి వానిని దనయాశ్రమమునకుఁ దీసికొనిపోయి పెంచుచుండెను. బాల్యమునుండియు ఋష్యశృంగుఁడు తండ్రి యాశ్రమము దక్క నన్యమేమియు నెఱుఁగక పరమస్వాధ్యాయ విదుఁడు నద్వితీయ బ్రహ్మచారియునై ఘోరతపము చేయుచుండెను. ఆతని తపోవిశేషమున కచ్చెరు వందిన యింద్రుఁ డాత డెచ్చటనున్న నచ్చట సువృష్టి కలుగు ననియుఁ బ్రజ లాధివ్యాధి రహితులై సుఖ ముందు రనియు నసుగ్రహించెను.

రోమపాదుని వృత్తాంతము

ఇట్లుండఁగా నంగదేశమును బరిపాలించు రోమపాదుఁడను రాజునకు సంతానము లేకపోయెను. ఈతఁడు దశరథుని మిత్త్రుఁడు. ఒకనాఁడతఁ డయోధ్య కరుదెంచి దశరథునకు సురభి యనుగ్రహమునఁ గలిగినశాంత యను కూతుఁగాంచి ముద్దాడి యామెను బెంపిమ్మని యడిగెను. కాని, దశరథునకును బిడ్డలు లేనికారణమున నాతఁ డంగీకరింపఁ డాయెను. అంత దగ్గఱనున్న వసిష్ఠమహర్షి త్రికాలవేది యగుట దశరథునితో శాంతను రోమపాదున కిమ్మనియు నామె వలనఁ ద్వరలో నిరువురకును బురుషసంతానము కలుగు ననియుఁ జెప్పెను. అంధులకు వా రుభయులు నానందించిరి. తుద కాఱు మాసములు దశరథునింట నాఱుమాసములు రోమపాదు నింట శాంత యుండునట్లంగీకరించి రోమపాదుఁడు శాంతనుదీసికొని యంగదేశమున కేఁగెను. తరువాత నాతఁడు పుత్త్ర కామియై బ్రాహ్మణుల కనేక దానధర్మములు చేయుచుండెను. ఒక నాఁ డొక బ్రాహ్మణుఁడు ..............................................................................................