పుట:Maharshula-Charitralu.firstpart.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టావక్ర మహర్షి

55


నిది. ఈమహర్షి జనకరాజర్షి తోఁ జేసిన వేదాంత విచారణ మద్వైత వేదాంతసారము నద్భుతముగా వెలిపుచ్చునదై యష్టావక్రసంహిత యను పేర శాశ్వతమై వెలసినది. ఈయష్టావక్రసంహితయందు ఆత్మోపదేశము, ఆత్మానుభవోల్లాసము, ప్రత్యాక్షేపద్వారోపదేశము, ఆత్మజ్ఞానసంకీర్తనము, లయయోగము, జ్ఞానయోగము, అనుభవపంచకము, బంథమోక్షవ్యవస్థ, నిర్వేదము, ఉపశమము, జ్ఞానము, స్వరూప సంస్థితి. ఆత్మసౌఖ్యానుభూతి, శాంతి, తత్త్వోపదేశము, విశేషోపదేశము, తత్త్వజ్ఞస్వరూపము, శాంతిశతకము, అత్మస్థితుని యనుభవము జీవన్ను క్తి యను నిరువది యధ్యాయములలో నాయా విషయము లద్భుతముగా వివరింపఁబడినవి. ఈసంహిత నిత్య పారాయణ యోగ్యము. అష్టావక్రుని బోధామృతమును గ్రోలి జనక రాజర్షి పొందిన యాత్మానంద మనిర్వాచ్యమైనది. ఈ సంహితయందలి "ఆకాశవదనంతో౽హం, ఘటవత్ ప్రాకృతం జగత్." "మహదధిరివాహం స ప్రపంచో వీచిసన్నిభః " "అహంనా సర్వభూతేషు" మున్నగు నద్వైతవేదాంతఘీంకారవములు అష్టావక్రమహర్షిని ధన్యాతిధన్యుని జేసివై చినవి.