పుట:Maharshula-Charitralu.firstpart.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54

మహర్షుల చరిత్రలు


పలువురు పుత్త్రులఁ బడిసిరి. అందుఁ బ్రచేతునకుఁ గొంతకాలమున కసితుఁ డను కుమారుఁడు జన్మించి విష్ణుభక్తుఁడై తపోవృత్తి నుండెను. కొంతకాలమున కాతఁడును వివాహితుఁడై తన సతికి సంతానము కలుగని కారణమున విచారించుచుండఁగా నాకాశవాణి యీశ్వరుని గుఱించి తపింపు మని ప్రబోధించెను. అసితుఁడు నీశ్వరుని గుఱించి మహా తపము చేయ నాతఁడు ప్రత్యక్షమై రాధామంత్ర మను స్తోత్ర రాజము నుపదేశించి యంతర్హితుఁడయ్యెను. ఆసితుఁ డేకాంతమునఁ జిరకాల మామంత్రము జపించి రాధాకారుణ్యమునఁ దనభార్యయం దొక పుత్త్రునిఁగని దేవలుఁ డని నామకరణము చేసెను. దేవలుఁడును మాలావతియను రాజకుమారిని వివాహమై సంతానమును బడసి మహావిరాగియై తపోవృత్తి నుండెను. అతని తీక్ష్ణతపోనలము త్రిలోకములను వేధింపఁ జొచ్చెను. ఆతని తపోభంగమునకై యింద్రుఁడు రంభను బంపెను, ఆమె యెంత ప్రయత్నించిన నాతని హృదయము చలింపదాయెను. అందుచే నామె కోపించి "ఓ దేవలా ! నీవు నన్నష్టకష్టములపాలు చేసితివి. నా యభీష్టము దీఱకుండఁ జేసితివి. కావున, నీవు మఱుజన్మమున నష్టావక్రుఁడవై జనింతు"వని శాప మిచ్చెను. అంత నామె వెడలిపోవుచు “దేవలా! నిన్ను నేననవసరముగ శపించితిని. ఐన, నాశాప మమోఘము. నీ వష్టావక్రుఁడవై జనించియు నీ తండ్రి కృపవలన దివ్యశరీరుఁడవై మహాజ్ఞానివై ముక్తి నందఁగల" వని రంభ స్వరోకమున కేఁగెను. 'ఆతఁడే యేకపాద సుజాతలకు బన్మించి సమంగానదీస్నానమున దివ్యశరీరియై మహా తపోధికుఁడై నేఁడిట్లు ముక్తి నందినాఁ" డని శ్రీకృష్ణుఁడష్టావక్రుని చరిత్రముఁ జెప్పి యందఱతో నిజగృహమున కేఁగెను.[1]

అష్టావక్ర సంహిత

ఇట్లు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని పాదారవిందములఁ బ్రాణములు వీడఁ గనిన యష్టావక్రమహర్షి సుకృతవిశేషము వర్ణనల కంద

  1. బ్రహ్మ వైవర్తపురాణము - శ్రీకృష్ణ ఖండము.