పుట:Maharshula-Charitralu.firstpart.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్రి మహర్షి

37


జెప్పెను. అనసూయ యంగీకరించెను. త్రిమూర్తులు స్నానము చేసి వచ్చి కూర్చుండ వారిపై ననసూయ మంత్రాక్షతములు జలమును జల్లఁగా వారు మువ్వురు నామె మాహాత్మ్యమునఁ జంటిబిడ్డలైరి. ఆమె నగ్నయై వడ్డించి పిమ్మట వస్త్రము ధరించి తిరిగి వారిపై జలము చల్లి యధాపుర్వముగాఁ ద్రిమూర్తులఁ జేసి భుజింపుఁడని కోరుకొనెను. వారు భుజింపఁగనే మరల వారిని శిశువులఁ జేసి తన గృహముననే యుయ్యెలలోఁ బరుండఁ బెట్టి యూఁచుచుండెను. సరస్వతీ లక్ష్మీ పార్వతులు భర్తలను వెదకికొనుచు వచ్చి యనసూయను బతిభిక్షము వేఁడిరి. అనసూయ వారి నాదరించి యాముగ్గురు బిడ్డల నిచ్చెను. వారాశ్చర్యపడి తమ భర్తలను బ్రసాదింపు మని యామెను బార్థించిరి. అనసూయ వారికి మ్రొక్కి మంత్రాక్షతములతో నా బిడ్డలఁ దిమూర్తులఁ జేసి యా త్రిమాతలకు నిచ్చెను. అంతఁ ద్రిమూర్తులును భార్యాసహితులై యనసూయామాహాత్మ్యమునకు మెచ్చుకొని తమయంశములచే లోకోద్ధారకులగు మువ్వురు పుత్రు లుదయింతు రని వరమిచ్చి యనసూయాత్రి మహర్షుల నాశీర్వదించి వెడలిపోయిరి.[1]

మఱియొక పర్యాయము కౌశికపత్ని శాసనమున సూర్యుఁ డుదయింపకుండఁగా లోకోపద్రవము కలిగెను. అప్పుడు బ్రహ్మ పంపున దేవత లా యుపద్రవమును బాపుమని యనసూయను గోరిరి. అనసూయ కౌశికపత్ని సంగీకరింపఁ జేసి సూర్వోదయమగునట్లు కావించి మరణించిన యామె భర్తను మెటనే బ్రతికించెను. అప్పుడును ద్రిమూర్తులు ప్రత్యక్షమై యామెకుఁ దమ యంశములఁ బుత్త్రత్రయ ముదయించు నని యాశీర్వదించిరి.[2]

అత్రిమహర్షి సంతానమునకై తపముచేయుట

అటుపిమ్మటఁ గొంతకాలమున కత్రిమహర్షి భార్యాసహితుఁడై ఋక్షపర్వతము పై నిలిచి దేవదేవుని గుఱించి శతవర్షములు ఘోరతప

  1. భాగవతము - మార్కండేయపురాణము.
  2. మార్కండేయపురాణము