పుట:Maharshula-Charitralu.firstpart.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

అత్రి మహర్షి

అత్రిమహర్షి సప్తమహర్షులలో నొకఁడు, అనసూయా మహాసాధ్వికిఁ బ్రాణనాథుఁడు, నిజతపః ప్రభావమున లోకోత్తరుఁడై న మహాపురుషుఁడు.

అత్రి జననము

సృష్టికర్తయగు బ్రహ్మదేవుఁడు తనకు సహాయుఁడుగా నుండి ప్రపంచమునఁ గొంత సృష్టికిఁ గారకుఁ డగు నను సుద్దేశముతో దన మానసమునుండి యత్రిని బుట్టించెను. అత్రి జన్మించి తండ్రికి నమస్కరించి "తండ్రీ! నీవు నన్నేనిమిత్తమై సృజించితివి? నీయాజ్ఞ నాకు శిరోధారణ మగును గాక! " యని పలుకఁగా బ్రహ్మదేవుఁడు సంతసించి "నాయనా! నీవు మహాతపస్సు చేసి లోక సంరక్షణమునకై కొందఱను సృజింపవలయు, సాహాయ్యము నేను చేయుచుందు" నని చెప్పి యత్రిని దపోవనమునకుఁ బంపి బ్రహ్మదేవుఁడు తన నివాసమున కేఁగెను.[1]

అత్రి తపోనియతి

బ్రహ్మదేవుని యాజ్ఞానుసార మత్రి బయలు దేఱి యొక వనమున కేఁగి యందుఁ దపోవృత్తి నుండెను. పంచభూతములచే నేర్పడి. రక్తమాంసాస్థికలచే హేయమై వినశ్వర మగు దేహముపై నిర్మ' మత్వము గలిగి యా దేహము కాని యాత్మను దర్శించి తదంతర్లీనత నానందసుస్థిర చిత్తమున నెగడఁ గనుటకే యమనియమములు, దాన

  1. భాగవతము.