పుట:Maharshula-Charitralu.firstpart.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగస్త్యమహర్షి

17


పదవి వహించి జగమును బోచెద ననియు లేనిచోఁ ద్రిజగముల నెచట బహుళోదారద్రవ్యకోటు లున్నవో వాని నెల్లఁ దెప్పించెద నవియుఁ దనశక్తి సంపన్నతను విశదీకరింప మునివరు లెల్లరు సగస్త్యుఁడు తపోధనము వ్యయింప నక్కఱ లేకయే తామే తెచ్చుకొందు మని వంతలు దక్కి యాగకార్యము నెఱవేర్ప మొదలిడఁగానే దేవేంద్రుఁ డీ సంగతిఁ దెలిసికొనీ భయభ్రాంతుఁడై కుంభవృష్టిఁ గురియ సంభోదములఁ బంపి వెంటనే బృహస్పతిని వెంట నిడుకొని వచ్చి వినయవినమితగాత్రుఁడై యగస్త్యుని శరణుచొచ్చి మన్నింప వేఁడుకొనెను. అంత నగస్త్యుఁ డాతనిని గౌరవించి యర్చనలిచ్చి శాంత ప్రియ వచనముల నెల్లరకుఁ బ్రమోదముఁ గల్పించి యింద్రుని బృహస్పతిని బంపివై చెను. తరువాతఁ ద్రిలోకవినుతముగా జన్నము పూర్తి యయ్యెను. అగస్త్యుఁడు వినయవిధేయతలతోఁ బరమమునులగు ఋత్విజుల కెల్లర కర్చనలిచ్చి యామంత్రించి యపూర్వమాహాత్మ్యము నందెను.[1]

అగస్త్యుఁడు తారక బ్రహ్మోపదేశము నందుటకై అవిముక్త క్షేత్రమున కరిగి యచట విశ్వేశ్వరుని సేవించుచుండెను.

దేవత లగస్త్యునికై వెదకుట

ఇటు లుండ. వింధ్యపర్వతము మేరుపర్వతముపైఁ గల యసూయ, సూర్యుఁడు తనచుట్టుఁ దిరుగక మేరుపర్వతము చుట్టు దిరుగు ననుకోవము కారణములుగా నొకప్పుడు మిక్కిలి పెరిగి సూర్యచంద్రనక్షత్రముల గమనమున కవరోధము కలిగించెను. అందుచే రాత్రిందివము లేర్పఱుపరాక లోకవ్యవహార మాఁగిపోయెను. అపుడు దేవత లెంత ప్రార్థించినను వింధ్యకుఁ గోపముపశమింప

  1. భారతము - అరణ్యపర్వము.