పుట:Maharshula-Charitralu.firstpart.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

మహర్షుల చరిత్రలు


యట్లు చేసెను. ఈ కారణముననే నాఁటి నుండి సముద్రజల ముప్పన యయ్యెను ; పర్వదినములఁదక్క స్నానపానాదుల కనర్హమయ్యెను.

అగస్త్యుఁడు శ్రీరాముని కుపకరించుట

అగస్త్యుఁ డాపిమ్మట ఘోరతపో నియమమును బాటింప దండకావన మధ్యమున నొకయాశ్రమము నిర్మించుకొని యందుండెను. ఆ సమయముననే శ్రీరామచంద్రుఁ డరణ్యవాసముచేయుచు శరభంగుఁడు. మందకర్ణి మున్నగు మహర్షులను దర్శించి సీతాలక్ష్మణ సమేతుఁడై వారిచేఁ బూజింపఁబడి సుతీక్ష్ణమునీశ్వరు నాశ్రమమున కేఁగెను. అచటఁ గొంతగాలముండి తరువాత శ్రీరాముఁ డగస్త్యాశ్రమమునకు సతీసహోదరులతో నేతెంచెను. అగస్త్యమహర్షి శ్రీరామ లక్ష్మణులఁ గౌఁగిట జేర్చి మూర్ధాఘ్రాణ మొనరించి యాశీర్వదించి, పురోభాగమున నున్న సీతామహాసాధ్వి నభినందించి మువ్వురకు నతిథి సత్కారములఁ జేసి యానందించెను. అప్పటి కగస్త్యుఁడు వానప్రస్థాశ్రమమున నుండుటచేఁ దదుచితముగా శ్రీరామాదులఁ బూజించి శ్రీరామునకు దివ్యమైన ఖడ్గయుగ్మము, వైష్ణవమైన విల్లు, అమోఘబాణములు, అక్షయమైన అమ్ములపొది, ఇచ్చి గౌతమీతీరమునఁ గల పంచవటి యం దాశ్రమము నిర్మించుకొనియుండుట శ్రేయస్కరమని సూచించెను. సీతాలక్ష్మణ సహితుఁడగు శ్రీరాముఁ డగస్త్యు ననేక వందనములతో స్తుతించి ముందునకుఁ బయనమైపోయెను

తరువాతఁ గొంతకాలమునకు శ్రీరామరావణుల ఘోరయుద్ధకాలమున రాముఁడు రావణ తీవ్రబాణములచే ముంపఁబడి భావికర్తవ్యము మఱచి యున్న తరుణమున నగస్త్యుఁడు శ్రీరాముని సన్నిధికేతెంచి శ్రీరాముఁడు విష్ణుమూర్తియగుట జ్ఞప్తికిఁదెచ్చి యాతని యనంతప్రభావమును గీర్తించెను. పిమ్మట శ్రీరామునకు