పుట:Maharshula-Charitralu.firstpart.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

11


యుక్తులై ధర్మచరితులైన ఋషులఁ జంపినఁగాని జగమున కషాయము వాటిల్ల దని కాలకేయాదులు వశిష్ఠాశ్రమమున నూటతొంబది యేడ్గురను, చ్యవనాశ్రమమున నూర్వురను, భరద్వాజాశ్రమమున నిరువదుండ్రను బ్రహ్మనిధుల భక్షించిరి. ఇట్లుపద్రవముఁ గొని తెచ్చు కాలకేయుల నెట్లు వధించుటో తెలియక యింద్రయమాగ్ని వరుణ కుబేరాదు లెల్లరును విష్ణుమూర్తిని బ్రార్థించిరి, విష్ణుమూర్తి వారి మొఱలాలించి యగస్త్యమహర్షి యాసముద్ర జలములఁ దానము చేయఁగలఁడనియు నపుడు రాక్షసులు బయలుపడఁగా వారిని జంపుఁడనియుఁ జెప్పి పంపివేసెను. వెంటనే యమరు లగస్త్యుపాలికేఁగి స్తుతించి తమ పచ్చినసని నెఱఁగించిరి. అగస్త్యుఁడును దేవ హితార్థమై యమరగణముఁ గూడి మహర్షి యక్షగణములు: తన్ననుసరింప వచ్చి సముద్రము నొక్కసారిగా నాపోళనించెను. త్రిజగజ్జను లచ్చెరువందిరి. దేవయక్షగణము లభినందించెను అంతఁ గాలకేయగణములు బయలుపడఁగానే దేవతలు విజృంభించి యసురుల నిశ్శేషముచేసి "పీత సముద్రుఁ"డని యగస్త్యు నెంతయుఁ గీర్తించిరి పిదప వారాతనిని

"మునివాథ! నీ యనుగ్రహ
 మున విగ్రహ ముడిగె నఖిల భువనంబుల కి
 వ్వనధిఁ బయ:పూర్ణముగా
 నొనరింపుము నీవ కాని యొరు లోప రిలన్"

ఇది యనేక జంతువుల కాశ్రయము. కాన, రిక్తమై యుండరాదు. తిరిగి పూరింపు మని వేడుకొనిరి. కాని, అగస్త్యుడు " "దేవతలారా! ఈ సముద్రజల మంతయు నా కిదివఱకే జీర్ణమయి పోయినది. [1]నే నిపుడు మూత్రద్వారమునుండి పూరంపఁగల"నని

  1. "ఇదిస్కాందపురాణమున, భారతారణ్యపర్వమునఁ గల గాథ. “నిశ్శేష వీతోజ్ఘి తసింధురాజ? " అని రఘువంశము.