పుట:Maharshula-Charitralu.firstpart.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అగస్త్యమహర్షి

7


నాతనికి సరిపోవు ధనమే యుండుటచే నిరువురును గలిసి బ్రధ్నశ్వుని కడ కేఁగి యర్థించిరి. అతనికడ నాతనికి సరిపడు ధనమే యుండుటచే మువ్వురును గలిసి త్రసదస్యుఁడసు రాజుకడకరుదెంచి యర్థించిరి. అతఁడు నట్టి స్థితియందే యుండ నల్వురుఁగలసి యిల్వలుఁడను రాక్షసునికడ కేతెంచిరి.

వాతాసీల్వల మర్దనము

మణిమతీపురాధిపతి యగు నిల్వలుఁడు విఖ్యాతబలుఁడు ఆతని తమ్ముఁడు నానాపి కామరూపి. ఒకనాఁ డిల్వలుఁ డుత్తమ బ్రాహ్మణు నొకనిఁ దనకు సకలకామ సిద్దికర మగు మంత్ర ముపదేశింపుమని కోరి విఫలుఁడై తన తమ్ముని మేఁకను జేసి వధించి యా మాంస మాబ్రాహ్మణునకు భోజనమునఁ బెట్టి భోజనానంతరము తమ్మునిఁ బిలిచెను. వాతాపి యా బ్రాహ్మణుని కడుపు వ్రచ్చి బయటకు వచ్చెను. ఆ ద్విజుఁడు వెంటనే మరణించెను. ఈ రీతి నదిమొదలు తనకడ కతిథులుగా వచ్చు బ్రాహ్మణులఁ జంపుట యిల్వలునకుఁ బరిపాటి యాయెను,

నాఁ డగస్త్యుఁ డామువ్వురు రాజులతో నిల్వలున కతిథి యాయెను. యథాపూర్వముగా నిల్వలుఁడు వాతాపిని మేఁకను జేసి చంపి వండి యం మాంసము, సగస్త్యునకుఁ బెట్టించెను. ఆ మువ్వురు రాజులు నీవిషయ మగస్త్యునకుఁ జెప్పినను వినక యాతఁడు వాఁడు కంఠముదాఁక భుజించెసు. ఇల్వలుఁడును దానెప్పటియట్లే తమ్ముని బిల్చు టెఱింగి యగస్త్యుఁడును " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణ " మ్మని కడుపుఁ దడవికొనుచు గఱ్ఱని త్రేన్చిన వాతాపి జీర్ణమైపోయెను. ఇల్వలుఁడు నాశ్చర్యమంది కుక్కివ పేనువలె మాఱాడక వచ్చినపని యడిగి యారాజుల కపరిమిత ధనమును బసిఁడియు నిచ్చి యగస్త్యునకు ..............................................................................................................