పుట:Maharshula-Charitralu.firstpart.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

మహర్షుల చరిత్రలు


ఎఱిఁగి యెఱిఁగి దీని నెట్లీఁగ నగు భోగ
యోగ్యయైనయది పయోజనేత్ర
యీనినాఁడు శాపమిచ్చుఁగా కీముని
యేల సైఁచు నింక నెట్టు లొక్కొ?"
                            (భార. ఆర. 2. 726, 727 )

యని విదర్భనరేంద్రుఁడు సంశయ భీతచిత్తుఁడై యుండఁగా లోపాముద్ర వచ్చి యా మునివరుని వివాహమగుటయే తన యభీప్సితమని తెలిపెను. అందులకు విదర్భధారుణీపతి యెంతయు సంతసిల్లి విధ్యుక్తముగా లోపాముద్రాగస్త్య మహర్షుల వివాహ మతి వైభవముతో జరపెను. ఈ వివాహప్రదేశము నాఁటినుండి “ సిద్దతీర్థ " మనుపేర మహాతీర్థ ప్రదేశముగా లోకప్రసిద్ధి గాంచెను. పిమ్మట నగస్త్యుఁడు లోపాముద్రను వల్కలాజిన ధారిణిఁజేసి తోడ్కొనిపోయి గంగా ద్వారమున నొక్క యాశ్రమమును నిర్మించుకొని గార్హస్థ్య ధర్మములు నిర్వర్తించుచుఁ దపోవృత్తి నుండెను.

ఆజన్మసిద్ధులై యావిర్భవించియు మన మహర్షులు లోక సంగ్రహమునకును సాధుసజ్జనుల కనువర్తన సాధనములగు నాదర్శ జీవితమును జూపుటకును యధావిధిగా బ్రహ్మచర్యాద్యాశ్రమములు నిర్వర్తించుచునే నిరంతర దైవచింతనమున నెగడెడివారు. అట్లే యగస్త్యుఁడు విశ్వశ్రేయమునకే వివాహమాడి కాలక్రమమున సహధర్మచారిణి సతీతిలకమునగు లోపాముద్రయందుఁ బుత్రులం బడసి పితరుల ఋణమును దీర్చి దన ధర్మమును నిర్వర్తింపఁ దలఁచెను.

ఈ కారణమున నొకనాఁ డగస్త్యుఁడు లోపాముద్రా సంగమ మపేక్షింప నామె తనకు సమస్తాభరణములు, సున్నిత . వస్త్రములు కావలయునని యాతనిఁ గోరెను. అగస్త్యుఁ డాపనికై తపోధనమును వ్వయింప నొల్లక శ్రుతర్వుఁడను రాజు కడకేఁగి యాతనికి సరిపోఁగా నేమేని ధనమున్నఁ దనకిమ్మని కోరెను. ఆతనికడ