పుట:Maharshula-Charitralu.firstpart.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

5


చర్యాశ్రమముననే యుండుట మా కీ భరింపరాని వేదనకు. నిట్టి దుస్థితికిని గారణమైనది. కావున నీవు మా కోరికఁ జెల్లించి యూర్ధ్వ లోకములఁ బ్రసాదంపవే"యని వేఁడుకొనిరి. ఈ మాటలు విన్న యగస్త్యుఁడును ధన పితరుల దుస్థ్సితికి జాలిగొని “మహాత్ములారా! పితృదేవతలారా! మీ కోరిక సిద్ధింపఁ జేసెదను. నమ్ముఁడు. కులమున నెప్పటికైన నొక యుత్తముఁడు జనించి యూర్ధ్వలోక గతు లొసంగు నని యెదురుచూచు పితరుల ఋణముఁ దీర్పని యా వంశజుని జన్మమేల? కాల్పనా? కావున, మీపం పొన ర్చెద" నని యగస్త్యుఁడు వారి యాశీస్సులఁ గొని యాశ్రమమున కేఁగెను.

అగస్త్యుని వివాహము

పితృ దేవతల యాదేశము శిరసావహింపఁ దీవ్రముగఁ గోరిన యగస్త్యుఁడు తన తపశ్శక్తిచేఁ బుత్త్రకాముఁ డగు విదర్భ రాజునకు జక్కని చుక్కయగు నొక కూఁతురు కలుగునట్లు వరమిచ్చెను. ఈ వరమున విదర్భరాజునకుఁ గూఁతురు కలిగెను.

ఆమె లోపాముద్ర యను నామముసఁ దలిదండ్రుల గారాపు బిడ్డయై జలమున విలసిల్లు నలినివలె, వినీతునం దొప్పు లక్ష్మినిఁ బోలి, యుద్యుక్తునం దొప్పు విద్యరీతి దినదిన ప్రవర్ధమానయై రూప గుణ సౌజన్యముల నప్రతిమానముగా ననురూప కన్య కాశతమున నొప్పు చుండ నొక నాఁ డగస్త్యమహర్షి విదర్భరాజుకడ కేతెంచెను. ఉచిత మర్యాదల నందిన పిదప లోపాముద్రను దనకిచ్చి వివాహము చేయుమని యగస్త్యుఁడాతని నడిగెను. అందుల కయ్యో!

నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులోఁ దపో
భారమువం గృశుండయిన బ్రాహ్మణుఁడీ లలితాంగిఁ బెండ్లియై
నారలుగట్టి కూర లశనంబుగ నుగ్రవసంబులోఁ దపో
భారము దాల్చియుండుమవి పంపక మిన్నకయుండ నేర్చునే?