పుట:Maharshula-Charitralu.firstpart.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

మహర్షుల చరిత్రలు


నిచ్చగింపక లోక సంరతణార్ధ మొకజలపూర్ణ కలశముస విడిచి యథేచ్చముగా వెడలిపోయిరి. కాలక్రమమున ఆ జలకలశమునుండి అద్భుత తేజస్వులై బ్రహ్మవర్చస ముట్టిపడ అగస్త్యుఁడు. వసిష్ఠుఁడు నుద్భవించిరి.

ఈ కారణముచేతనే వీరిరువురకును 'కలశజు ' లని, 'కుంభ సంభవు' లని, 'ఔర్వ శేయు' లని, 'మిత్త్రావరుణపుత్రు' అని, 'నహ్ని మారుతసంభవు' లని పేరు వచ్చెను. [1]

అగస్త్యుని బాల్యము

ఈ రీతి జన్మించిన యగస్త్యుడు క్రమముగా శుక్లపక్ష చంద్రుని వలె దేదీప్యమానుఁడగుచుండెను. అతఁడు బాల్యము నుండియు మహానిష్ఠాగరిష్ఠుఁడై బ్రహ్మచర్యము చేయుచు నిరుపమాన తపస్సంపదచే విరాజిల్లఁ జొచ్చెను. బాల్యముననే యాతని కుపనయనాది సంస్కారములను, బ్రణవ పంచాక్షరీ మంత్రోపదేశమును దేవతలే యొనరించిరి. ఆతఁడు పిదప నిష్ఠాతిశయమున బ్రహ్మచర్యపాలనము నుగ్రతపస్సు చేయుచుండెను. అందు నిరాహారుఁడు, నిర్జితేంద్రియుఁడు, నిర్దూత కల్మషుఁడునై నానాఁటి కాతఁడు దివ్యతేజస్వి యయ్యెను.

అగస్త్యునికిఁ బితృదేవతల యాదేశము

ఇట్లుండ నొకనాఁ డరణ్యములో సంచరించుచు నొక సల్లకీ వృక్షశాఖ నధోముఖులై | వ్రేలుచున్న కొందఱు మునీశ్వరులంజూచి యగస్త్యుఁడు "మహాత్ములారా ! ఇపుడు మీరీ దురవస్థలో నుండుటకుఁ గారణమేమి? ఇంతకూ మీ రెవరో యానతిం " డని వేఁడుకొనెను. అంత వారు విస్పష్టముగా “నాయనా! 'మే మన్యులము గాము పితృగణ దేవతలము. నీవు పుత్త్రులను బౌత్త్రులను గాంచి తప్పక మా కూర్ధ్వ లోకముల నొసంగఁజాలుదువని చిరకాలము నుండి కొండంత యాళతో నున్నాము. కాని, నీవట్లు చేయక బ్రహ్మ

  1. పద్మపురాణము - సృష్టిఖండము. భారతము - ఆరణ్యపర్వము .