పుట:Maharshula-Charitralu.firstpart.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

3


నచ్చెరువు గొలుపునట్లు తనతొడనుండి యొక జగన్మోహినిని బుట్టించెను. నారాయణుని యూరువునుండి పుట్టుటచే ఆమెకు "ఊర్వశి" అను పేరు కలిగెను.

ఆ యూర్వశిని జూడఁగనే సూర్యున కామె పైఁ గోరికకలిగెను. తనతో సుఖింప నాతఁ డామెను దనలోకమునకు రమ్మనెను. ఆమె వల్లెయనీ యాతని లోకమునకుఁ బోవుచుండ దారిలో వరుణ దేవుఁ డామెను జూచి మోహించి “తరుణీ ! నీ మీఁద నా మానసమునిలిచినది. నీవు నా లోకమునకు వచ్చి నాతో సుఖింపు" మని కోరెను. అందులకామె "దేవా! నన్నిదివఱకే సూర్యదేవుఁడు కామించి తన లోకమునకు రమ్మని కోరెను. అతని కోరిక దీర్చుటకై నే నేగుచుంటి" నని సమాధానము చెప్పెను.

వరుణుఁడది విని "కాంతా ! నీస్వాంతము నాపై నిలిపి పొమ్ము నా కదియే పదివే" లనెను. అందుల కామే యంగీకరించి మనసున వరుణుని స్మరించుచు సూర్యునికడ కేఁగెను. ఆతఁడామె భావమును గ్రహించి “ఓసీ ! ఒక పురుషుని మనమునఁ దలపోయుచు నింకొకపురుషుని గనగూడ వచ్చితివా? ఇంతకన్నా స్త్రీ, చేయఁగల యధికాపరాధము లేదు. ఈ దోషమునకు నీవు భూలోకమున బుధ పుత్రుఁడగు పురూరవునకుఁ బత్నివిగా జనింపుము. పొ"మ్మని శపించెను. ఆ శాపమువాతఁ బడి యామె వెడలిపోయెను.

కాని, మిత్రావరుణులకుఁ గామోపశమనము కాదయ్యెను. అమోఘవీర్యులగు మహనీయులకు వీర్యపతనము కానుండెను. 'ఇదియేమి! ఆశ్చర్య' మని వారాలోచింపఁగా మహేంద్రుఁడు అగ్ని వాయువులు కిచ్చిన శావము, అగ్ని సూర్యుని, వాయువు వరణుని బ్రవేశించి మునిజన్మ మందఁగోరుట, వారికిఁ దేట తెల్లమయ్యెను. అది గ్రహించి వారు స్ఖలనము : గోరు తమ వీర్యములను స్తంభింపఁజేయ