పుట:Maharshula-Charitralu.firstpart.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

మహర్షుల చరిత్రలు


దుర్వాసుఁడు లక్ష్మణుని మరణమునకుఁ గారకుఁడగుట

దుర్వాసస్సంయమీంద్రుఁ డొకప్పు డతిక్షుధాతురుఁడై శ్రీరామునిచే నాతిథ్య మందు నుద్దేశముతో నయోధ్యకువచ్చెను. ఆ సమయమున శ్రీరాముఁడు బ్రాహ్మణరూపుఁ డగు యమునితో రహస్యముగ మాటలాడుచు నెవ్వరిని లోనికి రానీయవల దనియుఁ దాను రావలదనియు లక్ష్మణుని నియమించెను. కాని, దుర్వాసుఁడు వచ్చి లోనికిఁ బోఁబోఁగా లక్ష్మణుఁడు నివారింప నాతఁడు వంశనాశనముగా శపింతుననెను. లక్ష్మణుఁడు భయపడి శ్రీరాముని కడ కేఁగి విన్నవించెను. శ్రీరాముఁడు తనయాన దాటిన లక్ష్మణుని నగరము వెడలనడవ నాతఁ డన్నయనుమతిఁ గొని సరయూనదిఁ గ్రుంకి యవతారమును జాలించెను. ఇట్లు దుర్వాసుఁ డిందులకుఁ గారకుఁ డయ్యెను.[1]

దుర్వాసుని యాధిక్యము

పరమేశ్వరాంశాసంభూతుఁ డగు దుర్వాసోమహర్షి యనేకులగు శిష్యప్రశిష్యులఁ జేరఁదీసి వారి కెల్లరకు విమల విద్యారహస్యముల నామూలాగ్రముగా నెఱింగించెను. త్రిలోక పూజ్యుఁడై లోక క్షేమంకరుఁ డైన యనసూయాగర్భశు క్తి ముక్తాఫలము నత్రితపస్సారము నగు దుర్వాసోమహర్షి మహర్షులలో నప్రతిమానుఁడు.

దుర్వాసుఁడు చెప్పిన రుద్రకవచము పరమశుభప్రదము

రుద్రక పచము

“ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పర మేశ్వరం
 ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్.
 రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షణే
 ఆహోరాత్ర మయం దేవం రక్షార్ధం నిర్మితం పురా

  1. ఉత్తరరామాయణము.