పుట:Maharshula-Charitralu.firstpart.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దుర్వాసో మహర్షి

151


దుర్వాసో మహర్షి

భూభారము తగ్గించుటకు యాదవవంశవినాశన మెట్లొనర్చుట యని శ్రీకృష్ణుఁ డొకపరిఁ దలపోయుచు దుర్వాసోమహర్షిని స్మరించెను. త్రికాలజ్ఞుఁడగు దుర్వాసుఁ డిది యెఱింగి ద్వారకకు వచ్చి వాకిట నుండ, దైవకృతమున యాదవకుమారులు సాంబుఁ డను వానికి స్త్రీ వేషము వేసి దుర్వాసునకు మ్రొక్కించి “సంయమింద్రా ! ఈమెకుఁ బుత్త్రుఁడెపుడు గల్గు" నని పరిహసించిరి. దుర్వాసుఁ డది గ్రహించి శ్రీకృష్ణుని సంకల్ప మీడేఱును గదా యని “మూర్ఖులారా ! ఈమెకు లోహరూప ముసల ముదయించి సపుత్త్ర బాంధవముగా యాదవ వంశము నిర్మూలించును. బ్రహ్మాదులు నిది తప్పింపలే" రని శపించి కృతకృత్యుఁడై యరిగెను. దానినే యాదవు లెల్ల రంతరించిరి.

దుర్వాసుఁడు పాండవుల కతిథి యగుట

ఒకమాఱు దుర్యోధనుఁడు పాండవుల నవమానింపఁ గోరి దుర్వాసునిఁ బ్రసన్నుఁ జేసుకొని యాతనిని సశిష్యుఁడై పాండవులకడ కేఁగు మని ప్రార్థించెను. దుర్వాసుఁ డట్లే యని శిష్యసమేతుఁడై ద్వైతవనమునఁ గల పాండవులకడ కేఁగ ధర్మ రాజాదు లమితభ క్తి శ్రద్ధలతో నాతని సేవించిరి. దుర్వాసుఁడును సశిష్యుఁడై భోజనమునకు వత్ తుననెను. ధర్మరా జంగీకరింప నాతఁడు శిష్యులతో నదీస్నానమున కేఁగెను. ద్రౌపదిప్రార్థన నింతలో శ్రీకృష్ణుఁడు పాండవులఁజూడ వచ్చి క్షుధాభారము నటించి ద్రౌపదిచే భోజన పాత్రముఁ దెప్పించి దానికంఠమున లగ్న మగు నొక మెతుకునుదిని పాండవుల కభయ మిచ్చెను. శ్రీకృష్ణప్రభావమున స్నాతులగు దుర్వాసునకు శిష్యులకు నాఁకలిదప్పులు లేకుండఁబోయెను. దుర్వాసుఁడు సమస్తవిషయమును యోగదృష్టి. నెఱింగి దుర్యోధనుని కుటిలాభిప్రాయము గ్రహించి యాతఁడు బంధుమిత్రాదులతోఁ బాండవులచే నోడిపోయి మడియ నుండుటఁగని శిష్యులతో వెడలిపోయెను. .