పుట:Maharshula-Charitralu.firstpart.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140

మహర్షుల చరిత్రలు


పోనిత్తునా ! నీ యైశ్వర్య మంతయు గంగపా లగుఁ గాక ! నీ యైరావతము శిరము ఖండింపఁబడుఁ గాక !" యని శపించెను. దేవేంద్రుఁడు వెంటనే దుర్వాసుని పాదములఁ బడి కరుణింప వేఁడుకొనెను. దుర్వాసుఁడు కరుణించి శ్రీహరిని బూజించినచోఁ దిరిగి స్వసంపద నందఁగలవని పలికి వెడలిపోయెను. ఈ శాపమూలముననే యమృతాదు లెల్ల సముద్రము పాలాయెను; ఐరావతము శిరము నఱుకఁబడి వినాయకుని కదుకఁబడెను.[1]

  1. "అని విష్ణుపురాణము. తన్నుఁ గుఱించి ఘోరతపము చేయు సుప్రతీకుఁ డను రాజు ననుగ్రహింపఁ దలఁచి దుర్వాసుఁడు విచ్చేయుచుఁడఁగా దారిలో నాధిని వనవిహారము చేయుచు నైరావతము నెక్కితిరుగు నింద్రుఁడు కానవచ్చెను. తన్నుఁ జూచి గౌరవింపక, వాహనమైన దిగక గర్వియై యున్న యింద్రుని జూచి మండిపడి దుర్వాసుఁడు:

    "అనుకంప లేక బ్రాహ్మణుని నమ్మించి గొం
            తుక గోసిపోయిన దోసకారి
     గౌతమఋషి కులాంగన నహల్యా దేవిఁ
            జీకటితప్పు చేసిన దురాత్మ
     పరసతి బిడ్డవి హరికోప హుతవహా
            ర్చులలోనఁ ద్రోచిన క్రూరకర్మ
     సగర క్షమాపాల సస్తతంతు విముక్త
            హరి మ్రుచ్చిలించిన పరమ ధూర్త

      .... దేవరాజ్యాధి పత్య
     మునకుఁ బెడడానే భువిఁగూలు మని శపించె. "

    అని వరాహపురాణమునఁ గలదు,