పుట:Maharshula-Charitralu.firstpart.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దధీచి మహర్షి

133


అంత విష్ణుమూర్తి క్షుపుని వెంటఁగొని దధీచికడ కేఁగి 'ఓరీ ! శివ గర్వితుఁడవైతివా? నేనును శివుఁడును నొక్కటిగాదా!' యని యడిగెను. దధీచి "నీ వేడ? శివుఁ డేడ? శివభక్తుఁడనగు నా గోటికైనను నీవు చాలవు. ఇఁక శివునితోడి సామ్యమెందుల" కని పరిహాసము చేసెను. విష్ణుమూర్తి దధీచి శిరముఁ దుంపఁ జక్రమును బంపెను. దధీచి తన తపశ్శక్తిచేఁ జక్రమును నివారించుకొనెను. విష్ణుమూర్తి మాయ వన్నెను. దధీచి మాయను ఛేదించెను. అంత విష్ణుమూర్తి "వత్సా! దధీచీ! నీభక్తి తాత్పర్యము బరీక్షింప నిటు వచ్చితిని. నిజముగా మా భక్తశ్రేష్ఠుఁడ వగు నీవంటివాని కాలి గోరితో నైనఁ బోలఁగలవాఁ డెవఁడు? నీవు దేవహితార్థివై జీవింపు" మని పలికి క్షుపునితో నాతని శరణు చొచ్చుటకంటె నుపాయాంతరము లేదని యంతర్హతుఁ డయ్యెను క్షుపుఁడు ధధీచి పాదములపైఁ బడి "మహాత్మా! నీశక్తి యెఱుఁగక నీ కెగ్గు చేసితివి. నా తప్పు సైరింపు" మని పరిపరివిధములఁ బ్రార్ధించెను. దధీచి శాంతుఁడై "మిత్రమా! నీ మీఁద నా కావంతయుఁ గోపములేదు. బాహ్మణక్రోధము నీటిపై గీఁత క్షణికములు కదా! నీవు యథాపూర్వము నా ప్రియమిత్రుఁడవై యుండు" మని యనుగ్రహించి యాతనిఁ బంపివేసెను.

ఈ రీతిగాఁ దపోనవద్యుఁడై వరశక్తిసంపన్నుఁ డయ్యు దధీచి మహర్షి శిష్యప్రశిష్యులఁ జేర్చికొని ధర్మసంరక్షనార్థము 'గభస్తిని ' యను నామాంతరము గల 'సువర్చ' యను కన్యను బరిగ్రహించి గృహస్థజీవనమును మహాదర్శముగాఁ గడపుచుండెను. సువర్చ మహాసాధ్వియై పతిపదపద్మ సేవ తక్క నన్య మెఱుఁగకుండెను. దధీచి కనతికాలముననే కోటానఁగోట్లు ఋషులు శిష్యప్రశిష్యులై రి.

ఇట్లుండ నొకనాఁడు దక్షప్రజాపతి యజ్ఞము చేయఁదలఁచి దధీచి మహర్షిని ......................................... .......................................................................