పుట:Maharshula-Charitralu.firstpart.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

మహర్షుల చరిత్రలు


యజ్ఞాదికము మాని భ్రష్టులగుచుండిరి. . యోగశాస్త్ర, మడుగంటి క్షీణింపఁగడంగెను. రాక్షసులు ప్రబలులై దేవతలను బాధింపం దొడఁగిరి. ఈ సమయమున దత్తాత్రేయుఁడు జనించి బాల్యము నుండియుఁ బరమయోగియై పెరుఁగఁ జొచ్చెను. ఆతఁడు చిన్న తసమునుండియు నిస్సంగియై కాలము పుచ్చుచుండెను. బాహ్యేంద్రియ నిగ్రహుఁడు నిరంతరాత్మానంద తన్మయుఁడు నగు నాతఁడు తల్లి దండ్రులను సంతోష పెట్టు చుండెను. బాల్యమునుండియు దత్తాత్రేయుఁ డింతటి వాడగుటఁ గన్నులారఁ గాంచిన తోడి మునిభాలు రెల్లపుడు నీతని కడనే యుండుచుండిరి. సంగ రాహిత్యమున కలవడిన దత్తాత్రేయ మహర్షికి వీరి రాకయే పలువిధముల బాధకరముగా నుండెను. అతని స్వేచ్ఛా ప్రవర్తనమునకు వా రడ్డు వచ్చుచుండిరి. ఈ కారణమున నాతఁడు వారి నట్లైనఁ దప్పించుకొన నెంచి యొకనాఁ డొక కొలనులో మునిఁగియుండెను. మునిపుత్త్రులేమైన నాతని విడువ నొల్లక యాతీరభూమినే నిలిచియుండిరి. ఎంతకాలమునకు వారట్లు తన్ను విడువకుండుటఁ జూచి యాతఁడు సంకల్ప మాత్రమున లక్ష్మి నటకుఁ దెచ్చి యామెతోఁ గొలనువీడి బైటకు వచ్చెను. స్త్రీసహితుఁ డైన నాతని నా ఋషిబాలురు విడువక పలువిధములఁ గీర్తించు చుండిరి. అంత నాతఁడు లక్ష్మి సంకితలమునఁ గూర్చుండఁ బెట్టుకొని మద్యపానము చేయుచు నాటలాడుచుఁ బాటలుపాడుచు లక్ష్మితోఁ గామాలాపము లాడ మొదలిడెను. అంత, మునిబాలకు లసహ్యించుకొని యా దత్తాత్రేయుని విడిచి యరిగిరి.

నాఁటినుండియు దత్తాత్రేయుఁ డాంతరంగిక తపోధ్యానపరుఁడై బహిరంగముగా మద్యపానము చేయుచు స్త్రీలోలుఁడై నట్లు నటించుచు నుండఁ దొడఁగెను. మహాయోగులు దక్క. నన్యులాతని నెఱుఁగలేక మూఢాత్ములై మరలిపోఁ జొచ్చిరి. యోగ శ్రీయుతులగువారికి హావ్యసేవనాసవసేవలు సమానమని సామాన్యులు తెలియఁ