పుట:Maharshula-Charitralu.firstpart.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమదగ్ని మహర్షి

117


జమదగ్ని కార్తవీర్యునిఁ జంపిన పరశురాముని శిక్షించుట

పూర్వము హైహయాధీశ్వరుఁ డగు కార్తవీర్యార్జునుఁడు దత్తాత్రేయు నారాధనముచేసి యతనివలన శత్రుజయమును, వేయి చేతులను, అణిమాదిసిద్ధులను, యశము, బలము, యోగీశ్వరత్వము, తేజము చెడని యింద్రియములను బడసి వెలుఁగొందెను. దిగ్విజయ యాత్రకై వచ్చిన రావణాసురు నీతఁ డవమానించెను, పిమ్మటఁ గార్తవీర్యార్జునుఁడు దైవయోగమున వేఁటకై యడవిలో సంచరించుచు జమదగ్నిమహర్షి యాశ్రమముచేరి యాతనిని దర్శించెను. జమదగ్ని మహర్షి రాజును భృత్యులును డస్సియుండుటఁ గాంచి వారిని బూజించి తన హోమధేనువును రప్పించి యిష్టాన్నములు గురియించి వారి నారగింపుఁ డని కోరెను. కార్తవీర్యార్జునుఁడు బ్రహ్మానందముతో షడ్రసోపేతముగా విందుఁ గుడిచి యా గోవుపైఁ గోర్కి, కలుగఁగా సపరివారముగాఁ దనపురమున కేఁగెను.

కాని, యా ధేనువుపైఁ గల మక్కువచే దానిని కొని తెండని కార్తవీర్యుఁడు తన బటులను బంపెను. వారు జమదగ్నితో యుద్ధమునకు సిద్ధపడిరి. జమదగ్ని సురభితో నీవిషయముఁ దెలిపెను. వెంటనే యామె రోమకూపములనుండి మహావీరులగు సైనికులు, నుత్తమ రథాశ్వములు వెలువడఁగా వానితో జమదగ్ని కార్తవీర్యుని సేనలతోఁ బోరెను. కార్తవీర్యుని సైనికులు హతమారఁగా నా సంగతిఁ దెలిసికొని కార్తవీర్యార్జునుఁడు ససై న్యుఁడై వచ్చి స్వయముగా జమదగ్నితోఁ బోరెను. కార్తవీర్యార్జునుండు రెండు మూఁడుపర్యాయము లోడిపోయి జమదగ్నికిఁ జిక్కి యాతనిచే బుద్దులు గఱపఁ బడియుఁ బాటింపక తిరిగి యాతనిపై యుద్ధమునకువచ్చి తిరిగి యోడిపోయెను. ఈ ప్రకార మిరువది పర్యాయము లోడిపోయి యిరువది యొకటవ మాఱు సురభివాక్యమును విస్మరించిన జమదగ్నిని సంహరించి సురభిని వెదకఁగా నా కామధేను వాతనికి లభింపక యింద్రునికడకుఁ బోయి