పుట:Maharshula-Charitralu.firstpart.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

మహర్షుల చరిత్రలు


కించుకదోషము గలుగ నామే హస్తమందలి ఘటము క్రిందపడి చిన్నాభిన్న మయ్యెను. ఎప్పుడైన జలభాండ మట్లు పగులుచో నామె మహత్త్వమున యిసుక తీసి తలపోయఁగనే భాండ మేర్పడెడిది. నాఁ డామె పూర్వవిధముననే యిసుక తీసి కుండ కావలయునని కోరఁగా నట్లు సంభవింపదయ్యెను. రేణుక మహాపతివ్రత గానఁ దన తప్పిదమును వెంటనే గ్రహించి యాదోషమున కానదిలోఁ బడి మరణింప నెంచెను. కాని, పతికి జరిగినవిషయము నివేదించి యాతని యాజ్ఞాబద్ధురాలగుటయే ! శ్రేష్ఠమని యెంచి భాండరహితయై యింటి కేతెంచెను.

జమదగ్ని భార్యచేత భాండము లేకపోవుటకుఁ గారణమేమని చూడఁగా దివ్యదృష్టి, కెల్లవిషయము గోచరించెను. చిత్రరథుని మక్కువఁ దగిలిన తన భార్య యాంతరంగికమున కసహ్యించుకొని యాదోషమున కామెకు మరణదండనమే శిక్షయని యతఁడు నిశ్చయించుకొనెను. రేణుకాదేవి సమీపింపఁగానే జమదగ్ని కొడుకులఁ గ్రమముగాఁ బిలిచి తల్లిని జంపివేయుఁ డని యాజ్ఞాపించెను. ఆహా ! జమదగ్ని సౌశీల్యాదర్శము! అన్యపురుషు ననురక్తిఁ గాంచిన నది వ్యభిచారమే యౌననిగదా పరమసాధ్వి యగు భార్య శిరము ఖండింపఁ జేయుట? అతఁడుకదా మహర్షి! పుత్త్రులలో మొదటి నల్గురు నాపని చేయలేమని చెప్పి వేసిరి. పరశురాముని బిల్చి జమదగ్ని తల్లిని, నన్న లను జంపుమని యాజ్ఞాపింపఁగా వెంటనే యాతఁడు తన పరశువుతో దల్లి, సోదరుల తలలను ఖండించెను. జమదగ్ని యాతని పితృభక్తికి సంతసించి యొకవరము వేఁడుకొను మనెను. వెంటనే పరశురాముఁడు చనిపోయిన తన తల్లిని సోదరులను బ్రదికింపు మని తండ్రిని గోరుకొనెను. జమదగ్ని పరశురాముని మాతృప్రేమమునకును భ్రాతృవాత్సల్యమునకును మెచ్చుకొని యట్లే చేసెను.