పుట:Maharshula-Charitralu.firstpart.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమదగ్ని మహర్షి

113


సంపాదించెను. ఆ ధేనువు వలసినపుడెల్ల నెందఱకైన నేమైన సమకూర్పఁగల సామర్థ్యము కలది. ఆ కామధేనువు కారణముగ నే కొఱంతయు లేక జమదగ్ని రేణుకాదేవితో సమస్తభోగము లనుభవించుచున్నను మహాతపస్సంపన్నుఁడై యుండెను.

జమదగ్ని సూర్యుని శపించుట

జమదగ్ని రేణుక పతిభక్తికి మెచ్చి యామెతో నర్మదాతీర మందలిది, నిర్జనము, ఫలపుష్పయుక్తము. శారికాశుకపికమయూర నినాదయుక్తము. సుగంధివాయుసురభీకృతము నగు వనమున కేఁగి యందు విహరించెను. పిదప, అపుడే వికసించిన పుష్పములఁ దల్పములుగ నేర్పఱిచికొని చందన చర్చిత గాత్రులై యా దంపతులు నఖక్షత చుంబనాదు లారంభించి క్రమక్రమముగా మన్మథక్రీడ లారంభించిరి.

ఆ సమయమున సూర్యుఁడు వారి కడకు విప్రరూపమున విచ్చేసి "ఓయీ! జమదగ్నీ ! నీవు బ్రహ్మ మనుమఁడవు, వేదకర్తవు, మహా తపశ్శాలివి. అట్టి నీ విట్లు పట్టపగలు సురత క్రీడకుం జొచ్చుట ధర్మమా?' యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః' యన్న నానుడిని బట్టి పెక్కురు నిన్ననుసరింతురు. తాపసశేఖరుఁడ వగు నీవే యిట్లు ధర్మమును నిరాకరించిన వేదధర్మములు హీనత నందవా? నేను గర్మసాక్షి నగుటచే నీ కిటు చెప్పవచ్చితి" నని పల్కెను.

అది విని జమదగ్ని సురతవిముఖుఁడై నిలువ నగ్న యగు రేణుక వెంటనే సూక్ష్మవ్యస్త్రము ధరించి సిగ్గుపడి నిలిచెను. అంత జమదగ్ని సూర్యునితో "ఓయీ! నీవు పండితాహంకారమున నాకుఁ జెప్ప వచ్చితివి. భృగుశిష్యుఁడను, చతుర్వేద ధర్మాధర్మము లెఱుంగని వాఁడనా ? అజ్ఞాని స్వకర్మచే నెల్లప్పుడు జడిభూతుఁ డగును. నిజ్జాని సర్వభక్షకుండగు నగ్నివలె మహాతేజస్వియై కర్మదోషములఁ