పుట:Maharshula-Charitralu.firstpart.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

మహర్షుల చరిత్రలు

మఱియొకప్పు డింద్రుఁడు గర్వియై కోపించి చ్యవనునిపై నొకపర్వతమును విసరెను. చ్యవనమహర్షి వెంటనే తన కమండ లూదకము మంత్రించి చల్లఁగానే యాపర్వత మెదురు తిరిగి యింద్రునిపైనే పడెను. ఆ కారణమున వెంటనే యింద్రుఁడు మూర్ఛవోయెను. చ్యవనమహర్షి కరుణించి యాతని కేబాధ లేకుండఁ జేసి మూర్ఛనుండి మేల్కొలిపెను. ఇంద్రుఁడు సిగ్గుపడి వెడలిపోయెను. ఆహా! చ్యవనుఁ డెంతదయాశాలియో కదా! అపకారి కుపకారర మొనరించి తన యభేదభావము 'నాతఁడు చాటింనాఁడు. ఇదే మన ఋషులలో మనము గ్రహింపవలసిన రహస్యము. వా రాత్మజ్ఞులు. అహంకార మమకారరహితులు. కాని, యెదుటివారియందలి రజస్తమోగుణముల ప్రకోపము నణచుటకుఁ గ్రోధము నటించి శాపాయుధమున నెదుటివారిఁ జక్కఁజేసి వెంటనే తమయాయుధ ముపసంహరించుకొను మహాశక్తిసంపన్నులు వారు వారికిని మనకును బోలికయే లేదు.

చ్యవనుఁడు సుకన్యకుఁ బుత్త్రుల ననుగ్రహించుట

నవయౌవనుఁడై న చ్యవనుఁడు సుకన్యాపాతివ్రత్యమునకు సంతసించి యామెకు సకలభోగముల నొసఁగి యానందింపఁ జేయనెంచెను. ఒకనాఁడు సుకన్యను బిలిచి “సాధ్వీ ! నేను ముసలివాఁడ వని రోయక దేహ సౌఖ్యముల నిన్నుఁ దేల్పకున్నను నీవు నాయం దతి విధేయురాలవై యుంటివి. కావున యౌవనము నీకొఱకే ధరించితిని. నీ త్యాగశీలమునకు మెఱుఁగు పెట్టఁ గల్గు నొక్క సుపుత్రునిఁ దత్తుల్యకీర్తిప్రదులగు నిరువురు కుమారులను నీ కనుగ్రహింతు" నని చ్యవనుఁడు సుకన్యను గారవించెను, “మీ కటాక్షమునకు మించి నాకేమి కావలయు " నని యామె యాతనితో స్త్రీసౌఖ్యము సనుభవించెను. కాలక్రమమున నా మెకు దధీచి. ప్రమతి, ఆ పవానుఁడను కుమారులు జన్మించిరి. మహాతపస్సంపన్ను లగు మహర్షులు తుచ్ఛ