పుట:Maharshula-Charitralu.firstpart.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

మహర్షుల చరిత్రలు


వీర్యమునుండియే కృషి, కృపాచార్యుఁడు జన్మించిరి. మఱియొక పర్యాయము కామవాంచోపహతయైన యహల్యకు గౌతము ననుగ్రహమున గర్భమై యంజన యను కూఁతు రుద్భవించెను. ఈయంజన పితృవాత్సల్యమునకు గుఱియై నిరంతర మహల్యకడనే యుండు చుండెను. ఈమె కొడుకే ఆంజనేయుడు.

మఱికొంతకాలమునకు గౌతముని కృపవలన అహల్య గర్భము ధరించి, మఱియొక కుమార్తెను గాంచెను. ఈ కుమారినే గౌతముఁడు తన శిష్యుఁడగు నుదంక మహామునికి నూతనదేహము నవయౌవనము నొసఁగిన తరువాత నిచ్చి వివాహము చేసెను.[1]

గౌతముఁ డహల్యాశత్రుల శపించుట

అహల్యవివాహ మైనప్పటినుండియు నింద్రుడామె లోకాతీత సౌందర్యమునకు వశుఁడై యామెపొందు కోరుచునేయుండెను. కాని యహల్యాసాధ్వి చిత్తవృత్తి యెఱిఁగి గౌతమమహర్షి కోపానలమునకు వెఱచి యుండెను. కాని, యొకనాఁ డింద్రుఁడు తనకోర్కె దీర్చుకొనఁ గోరి యొక యుపాయ మాలోచించి కోడియై గౌతమాశ్రమమునఁ జేరి నాఁటి నడురేయియే కూయఁ దొడఁగెను. ఈ కోడి కూఁతవిని గౌతమమహర్షి కాలకృత్య నిర్వహణమునకు నదీస్నానమునకై యాశ్రమము వీడి వెడలిపోయెను. ఈ యవకాశమును బురస్కరించుకొని యింద్రుఁడు గౌతమవేషముతో నాశ్రమముఁ బ్రవేశించి యహల్యతోడి సంగమ మపేక్షించెను. ఆమె యీ ద్రోహ మెఱుఁగఁజాలక కామోపహతుఁడగు భర్తకు వ్యతిరేకము పలుకలేక యంగీకరించెను. అంత వారిరువురును నొడలు మఱచి సుఖానుభవము నందుచుండ గౌతముఁ డింకను జాల ప్రొద్దు గలదని యాశ్రమమునకు వచ్చి చేరేను. లోపలఁ ప్రవేశింపఁగనే యహల్య

  1. భారతము - అశ్వమేధపర్వము.