పుట:Maharshula-Charitralu.firstpart.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహర్షుల చరిత్రలు

గౌతమ మహర్షి

శతపథబ్రాహ్మణము ననుసరించి గౌతమమహర్షి బ్రహ్మ మానసపుత్త్రులలో నొకఁడు; సప్తర్షులలో సుప్రసిద్ధుఁడు, శ్రుతుల ననుసరించి గౌతమవంశమున జన్మించిన యొక మహర్షి . ఈ గౌతమ మహర్షి యే గౌతమధర్మ సూత్రకర్త.

అహల్యా గౌతముల వివాహవృత్తాంతము

తొల్లి విష్ణుమూర్తి మోహినీరూపము ధరించి త్రినేత్ర సురా సురుల సైతము మోహింపఁ జేయఁగా నెల్లరును. బ్రహ్మ సృష్టిని జప్పగఁ దలపోసిరి. ఆ కారణమున నధిక ప్రయత్నమున నఖిలలోక మోహనముగా నబ్జభవుఁ డహల్యా మోహనాంగిని సృష్టించి నైష్టిక బహ్మచర్యమునఁ దపము సలుపు గౌతమునకుఁ బరిచర్య చేయ నియోగించెను. అహల్య యంగీకరించి హోమాదికృత్యములం దెల్ల నిచ్చలాతనికి సపర్య లొసరించుచుండెను. గౌతముఁడు నా మెయం దేమాత్రమును లౌల్యము లేకుండ నుండెను. కొంతకాలమున కహల్య యౌవనము నంది సౌందర్యమున నద్వితీయయై యలరారెను. అంత గౌతముఁ డామెను దోడ్కొనిపోయి బ్రహ్మ కిచ్చెను. బ్రహ్మదేవుఁ డామెను గౌతమునికే యిచ్చి వివాహము చేయనెంచెను. కాని, యామె త్రిలోకసుందరి యగుట “మా కిమ్ము మాకి"మ్మని యింద్రాది దేవతలే వచ్చి 'బ్రహ్మ' నడుగఁ జొచ్చిరి. గౌతముఁడు మాత్ర మెన్నఁ డడుగలేదు. బ్రహ్మ యుపాయ మూహించి భూప్రదక్షిణము చేసి యెవరు ముందు తనకడకు పచ్చెదరో వారికే యహాల్య .....................................................................................................................