పుట:Maharshula-Charitralu.firstpart.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కశ్యప మహర్షి

87


యింట నుంచుకొన్న స్త్రీ భార్యకాఁజాల దని, యామె దేవ పిత్సకార్యములలోఁ బాల్గొన నర్హురాలు కాదని కశ్యపుఁడు చెప్పిన శ్లోకమును బోధాయనుఁడు పేర్కొనెను. విశ్వరూప హరదత్తాదు లెల్లరును గశ్యపస్మృతినుండి యుదాహరించి యున్నారు.

కశ్యప గీత

కశ్యపమహర్షి క్షమాగుణమును బ్రశంసించుచుఁ దెలిపిన వాక్యములకే కశ్యపగీత యని పేరు. దానియందలి ప్రధాన భావమిది. వేదములు, యజ్ఞములు, శౌచము, సత్యము, విద్య, ధర్మము, సచరా చరమయిన జగమంతయు క్షమయందే నిలిచినవి. తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలు, బ్రహ్మవిదులు పడయు పుణ్యగతులు క్షమావంతులు పడయుదురు.[1]


  1. కశ్యపగీతా
    క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదా క్షమా శ్రుతమ్ !
    య ఏతదేవం జానాతి వసర్వం క్షంతు మర్హతి ? ||
    క్షమా బ్రాహ్మ క్షమా సత్యం క్షమా భూతం చ భావి చ|
    క్షమా తపః క్షమా శౌచం క్షమ యేదం ధృతమ్ జగత్ ||
    అతియజ్ఞవిదాన్ లోకాన్ క్షమిణః ప్రాప్నువంతి చ |
    అతిబ్రహ్మ విధాం లోకా వతి చాపి తపస్వినామ్ ||
    అన్యే వై యజుషాం లోకాః కర్మణామపరే తథా |
    క్షమావంతాం బ్రహ్మ లోకే లోకాః పరమపూజీతాః ||
    క్షమా తేజస్వినాం తేఱః క్షమా బ్రహ్మ కపస్వినామ్ |
    క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞ! తమా శమః ||