పుట:Maharshula-Charitralu.firstpart.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మహర్షుల చరిత్రలు


కశ్యపుఁ డట కరుదెంచి వారి కిట్లు బోధించెను. “కాంతలారా! పురాకృత కర్మఫల మనుభవింపక తప్పదు. మీ పుత్త్రులు శమదమ దయాధర్మనిరతులు కారు. అందుచే వారు నశించిరి. మీరు వారికై నగవవలదు. ఏలన దుఃఖము, సత్యధర్మములను నశింపఁజేయును. ధర్మక్షయము వలనఁ బుణ్యక్షయ మగును. పుణ్యక్షీణతయే సర్వదుఃఖములకుఁ గారణము. అందుచేతనే మహాఋషులు సంసారము బహుళదుఃఖమునకుఁ దా వని దానిని రోసి దానివలన దుఃఖము తమకిఁకఁ గలుగకుండుటకై ఘోరతప మొనరింతురు.

నిత్యుఁడు, నిర్వికారుఁడు, నిర్గుణుఁడు నగు పరమాత్మయందు మాయాశక్తివలనఁ బంచతన్మాత్రలు. పంచభూతములు పుట్టినవి. వానివలన లోకములు, స్థూల శరీరములు మున్నగునవి పుట్టినవి : జ్ఞానేంద్రియ ప్రాణపంచకములు, మనోబుద్ధులు జనించినవి. లింగ సూక్ష్మకారణశరీరములతో నైక్యభ్రాంతి నొంది పరమాత్మ జీవుఁడై కర్మఫలభోక్త యగును. జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాభిమాని యై జీవుఁడు విశ్వుఁడు, తైజసుఁడు. ప్రాజ్ఞుఁడు నగును. శరీరమునే తానను కొను జీవుఁడు గురూవదిష్ట మహావాక్యముచే అపరోక్ష జ్ఞానమంది పునరావృత్తిరహితమైన మోక్షమందును. ధర్మము, శరీగము. సత్యము, హృదయము, నగు విష్ణుని భజించి తత్కీర్తన స్మరణ పూజావందనములచే జీవుఁడు జీవత్వభావము విడిచి పరమాత్మతాదాత్మ్యము నందఁ గలడు" ఇట్లు బోధించి వారికి జ్ఞాన సుఖ మొసఁగి కశ్యపుఁడు తపమున కేఁగెను.[1]

కశ్యపస్మృతి

కశ్యపస్మృతి లేక కశ్యపధర్మసూత్రము లను పేర నొక ధర్మశాస్త్రము గాననగుచున్నది. అగ్నిసాక్షిగా వివాహమాడక కొని

  1. పద్మపురాణము- భూమిఖండము.