పుట:Maharshula-Charitralu.firstpart.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కశ్యప మహర్షి

85


ననుభవించెను. తరువాత నొకనాఁడు సముద్రుఁడు వచ్చి యా హోమధేనువుల నిచ్చివేయుమని కశ్యపునిఁగోరెను. కశ్యపుఁ డిచ్చివేయ నెంచినను నాతవి భార్యలగు నదితియుఁ గపిలయు నీయ నంగీకరింపని కారణమున మరల వెనుదీసెను. సముద్రుఁడు బ్రహ్మతోఁ జెప్పుకొన్నను బ్రయోజనము లేకపోఁగాఁ కశ్యపుఁడు భూమిపై గోపాలకుఁడై పుట్టుఁగాక యని యాతఁడు శపించెను. ఆ శాపముచేతనే కశ్యపుఁడు వసుదేవుఁడై పుట్టి కంసుని గోగణమున కధిపతి యయ్యెను.

కశ్యపునివలన దితికి మరుద్గణము పుట్టుట

ఇంద్రుఁడు బలవంతుఁడై దితికుమారులను బాధించుచుండఁగా నొకనాఁడు దితి భర్తను జేరి విచారముతోఁ దన కింద్రునంతబలము కలయొక కుమారు నిమ్మని కోరుకొని యనేక వర్షము లతనికి శుశ్రూష చేసెను. కశ్యపమహర్షి యామె కోరిక చెల్లించెను. దితి గర్భవతియై యుండఁగా నింద్రుఁడీవిషయ మెఱిఁగి తనసేవ నంగీకరింపుమని దితిని గోరఁగా నామె యానందించి యంగీకరించెను ఒకనాఁ డామె యశుచియై శయనించియుండఁగా నింద్రుఁడామె గర్భమును బ్రవేశించి గర్భస్థశిశువు నేడు ఖండములుగాఁ జేసెను. అంత నా ఖండము లేడు నేడుగురు శిశువులై విలపించుచుండఁగా నొక్కక్కని నేడేసి ఖండములుగా మరల నింద్రుఁడు ఖండించెను. . ఈలోపున దితి మేల్కొని యీవిషయ మెఱిఁగి వా రతనికి శత్రులు గాక మిత్రులే యగుదురని యింద్రుని రక్షింప వేఁడెను. ఇంద్రుఁడు వారి ననుగ్రహించి వెడలిపోయెను. ఇట్లు వారు నలువది తొమ్మండ్రుగురును బుట్టి 'మరుద్గణ' మనుపేర విలసిల్లిరి.

కశ్యపుని జ్ఞానబోధ

కశ్యపుని భార్యలలో దితిదనువు లొకప్పుడు తమ పుత్త్రులు దేవతల చేతిలో మృతి చెందిరని మిక్కిలి దుఃఖంపఁ దొడఁగిరీ. అపుడు