పుట:Maharshula-Charitralu.firstpart.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

మహర్షుల చరిత్రలు


అదితి కౌపీన మిచ్చెను. బ్రహ్మ కమండలువును, సరస్వతి యక్షమాలికయు సప్తర్షులుఁ గుశ పవిత్రములు నిచ్చిరి. ఈ ప్రకారము వామనుఁడు వడుగై తల్లి దండ్రుల యాజ్ఞఁ గైకొని బలిచక్రవర్తికడ కేగి మూఁడడుగుల దానము రూపమున నాతనిఁ బాతాళమున కనిపి స్వర్లోక రాజ్యమును నిజసోదరుల కొసఁగి మాతృకాంక్షను దీర్చెను.[1]

కశ్యపుఁడే వసుదేవుఁడు దశరథుఁడు, నగుట

ఒకమాఱు కశ్యపుఁడు కద్రువకోరికఁ దీర్పనెంచి యామెచే ననేక వత్సరములు శుశ్రూషఁ గొని తత్పలితముగా నామెతోఁ గ్రీడించుచుండెను. ఆ సమయముననే యీవిషయ మెఱుఁగని యదితియు భర్తతోడి సంభోగమపేక్షించి నూతన వస్త్రాభరణయై యలంకరించుకొని కశ్యపమహర్షి యాశ్రమమున కేఁగెను. కద్రూ సహితుఁడైన పతిఁ గాంచి యదితి మాత్సర్యసహితయై తన ప్రయత్నమువిఫలమగుటకుఁ జింతించెను. తాను వాంఛించిన సౌఖ్యమున కడ్డువచ్చిన కద్రూ కశ్యపులపైఁ గోపించి వారిని నరులై జన్మింపుఁడని యదితి శపించెను. ఆ కారణమునఁ దరువాతఁ గశ్యపుఁడు వసుదేవుఁడు గను, గద్రువ దేవకి గను జన్మించిరి. కశ్యపుఁడు ప్రతి జన్మమందును దనకేవిష్ణుమూర్తి కుమారుఁడుగా నవతరింపఁ గోరుకొనెను. విష్ణుమూర్తి యాతని కోరిక నంగీకరించి యదితి కశ్యపులకు వామనమూర్తియై జన్మించెను. వసుదేవరూపమున నున్న కశ్యపునికే దేవకి యందుఁ గృష్ణుఁడై జన్మించెను. కశ్యపుఁడే దశరథుండై కౌసల్య యందు శ్రీరామచంద్రునిఁ గాంచెను. ఈ విధముగాఁ గశ్యపుని కోరిక ఫలించెను.[2]

పూర్వ మొకప్పుడు కశ్యపుఁడు సముద్రుని హోమధేనువుల నాతనియనుమతి నింటికిఁ దోలుకొనిపోయి చిరకాల మా గోక్షీరముల

  1. భాగవతము.
  2. బ్రహ్మవైవర్తపురాణము.