పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము.

85


డబెట్టబడి యుండెను. జనులందరును అతనివద్దకు వెళ్లి ప్రణామములు గావించుచుండిరి. ఆ సమయమున నతడే అయోధ్యాధిపతియైన రామచంద్రుడట. మరికొంతదూరమున యుద్ధ క్షేత్రముం డెను. ఒక ప్రక్క కొందరు ఒంటలవలెను మరికొందరు గుఱము వలెను, మరికొందరు మేకలవలెను ముఖములకు వేషములు వేసికొని అనేకమంది రాక్షస రూపధారులుండిరి. వారు బారులు తీర్చినిలబడి యేమేమో ఆలోచించు చుండిరి. గుర్రపుమూతిని ఒంటెచెవిప్రక్కను, ఒంటె మూతి మేక చెవి పద్దను ఈరీతిగా నుంచికొని పరస్పష రహస్యములు చెప్పుకొనుచుండిరి. గొప్ప యుద్ధసన్నాహముజరుగుచుండెను. కొంత సేపయిన పిమ్మట వారిమధ్య ఒక " బాంబు' పడెను. అన్ని వైపులను బాణసంచా కాల్చ నారంభించిరి. నేనెవ్వరితోను ఏమియు చెప్పకుండ అక్కడ నుండి చల్లగా నవతలకు జారితిని.


పిమ్మట కాశి వద్దనుండి వింధ్యాచలము దర్శించుచు మిర్జాపుర మువరకు నౌకపై పయన మైతిని. అప్పుడా మిధ్యాచల క్షుద్ర పర్వతము లనుచూచియే నేను పొందిన ఆనందము, యుత్సాహము ఇంతింతని చెప్పజాలను. తెల్లవారుఝాము మొదలు మట్టమధ్యాహ్నము వరకు ఎండలో తిరిగి తిరిగి, కుత్పిపాసలచే పీడీంపబడి, పడవకు మరలి వచ్చి, కొంచెము పాలు తాగి ప్రాణముల నిలబెట్టు కొంటిని. విధ్యాచలమందు యోగమాయ, భోగమాయ, కూడగాంచితిని. యోగి మాయకు పది చేతులుండెను. రాతితో చెక్క బడియుండెను. అక్కడ నొక్క యాత్రికుడైనను ఒక్క ప్రాణియైనను కనబడ లేదు. కానీ భోగమాయ మందిరమునకుపోగా కాళీ ఘట్టమువలె కిక్కిరిసియుండెను. నుదుట ఎర్రగంధము బొట్టుపెట్టుకొని, ఎఱ్ఱని పాగాలు ధరించి జవాపుష్పమాలికలతో నలంకృతులై ఉత్తరహిందూ దేశస్థులు మేకలను బలియిచ్చి రక్తమును ప్రవహిం