పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

మహర్షీ దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము


నము చేయుచు నిద్దరు దాసీలు కనబడిరి. ఆస్వరము లతి మనోహరములుగు నుండెను. ఇది రాజుగారి ఆగమున వార్తయని తెలిసికొంటిని, ఆయన'నాకు సాదరముగ స్వాగతమిచ్చి తమసభలోనికి గొనిపోయిరి. మెటనేఅచ్చట నృత్యము, గానము ప్రారంభించిరి. ఆయన నాకొక రత్నపుటుంగరము బహుమానముగా నిచ్చెను. దీనిని నేనతి వినయముతో గ్రహించి ఆయనవద్ద సెలవు తీసికొంటిని. ఆయన, “మిమ్ము దర్శించి అత్యంతానందము పొందితిని. దశమినాడు తమరు తప్పక 'రామలీల' కు దయచేయవ లెను” అనెను. నేనాయన కభివాదము చేసి సూర్యాస్తమయ మునకు కాశి చేరితిని.


'రామలీల' దినమున నేను రామనగరము చేరితిని. రాజుగారొక పెద్ద యేనుగు నెక్కి హుక్కా పీల్చుచుండెను. ఆయన వెనుక ఇంకొక చిన్న యేనుగ సదరత్న ఖఛితమైన హుక్కా గొట్టములతో “హుక్కా బర్దార్' కూర్చుం డెను. ఇంకొక యేనుగుమీద రాజగురువు కాషా యాంబరముల ధరించి మౌనము వహించికూర్చుండెను. నోటినుండి ఎక్కడమాట వచ్చిపోవునోయను భయముతో ఆయనతన నాలుక ఒక కర్రకట్టులో బంధించు కొనెను. ఈ స్వల్ప విషయములో కూడ తన కేతనయందు నమ్మకము లేకుండెను. నాలుగు ప్రక్కలను కర్నల్ , జనగల్ , సైన్యాధ్యక్షులు, ఒక్కొక్కరొక్కొక్క యేనుగు నెక్కి రాజును చుట్టియుండిరి. నేనెక్కుటకు కూడ నాకొక 'యేనుగునిచ్చిరి. 'మేమంద రము కలసి ' రామలీల' రంగ భూమికి యాత్ర చేసితిమి. అక్కడకు వెళ్లి చూచు సరికి ఆస్థలమంతయు జనులతో నిండి ప్రజారణ్యమువలె నుండెను. అది మరియొక 'కాశివ లెనుండెను. అక్కడ నొకచోట ఒక సింహాసనమువలే ఏర్పాటు చేయబడియుండెను. అదంతయు పుష్పములతో నలంకరింప బడియుండెను. దాని పైనొక పందిరియుండెను. ధనుర్బాణములను హస్తములలో ధరించిన బాలుడొకడు ఆసింహా సముపై కూర్చుం