పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ ప్రకరణము.

77


ఐరోపా ప్రధమ సందర్శనానంతరమున తిరిగి వచ్చిన ఆరు మాసములకు, మాతండ్రిగారు 1848 వ. సం|| రం. భాద్రపదమాస ములో తన యావదాస్తిని నూముగ్గురు సోదరులకు సమ భాగముగా విభ జించి యొక “ వీలు వ్రాసెను. భద్రాసనగృహము, మూడంతస్థుల కచేరి మేడ, నా రెండవ తమ్ముకు గిరీంద్రునకును, గృహము యొక్క పశ్చిమ ప్రాంగణమున నున్న - స్థలమంతయును, గృహనిర్మాణము కొరకు 20,000 రూపాయలును మాచిన్న తమ్ముడు నాగేంద్ర నాధున కును ఇచ్చి వేసెను. Care Thyara R Co, పేరుతో నున్న వాణిజ్య వ్యవ సాయములందు మతడి కొక అర్ధ భాగముండెను. మిగిలిన భాగస్టు లాగ్లేయులు, మాతండ్రి సగముభాగము నాకే యిచ్చెను,గాని దానిని పూర్తిగా నేనే ఉంచుకొనక మాముగ్గురన్నదమ్ములకు సమముగా పంచి యిచ్చితిని.


గిరీంద్రునకు వ్యవహారములో మంచి చాక చక్యముండెను.*కంపెనీ ' లో భాగస్థుడైన పిమ్మట నొకానొక దినమాతడు నాతో,నిట్లనెను, “ కంపెనీ పెట్టుబడి అంతయు మనదేకదా ! ఈ ఆంగ్లేయులతో మన కేల భాగముండవలయును? వ్యవహారమంతయు మన మేలతీసికొన రాదు ? " __ ఈ అభిప్రాయమునాకు నచ్చలేదు. “ఇదంతమంచిమాట కాదు, వారు భాగస్టులుగానుండుటచే వారు ఉత్సాహముతోను మనోబలముతోను కార్యములు చేయుచున్నారు. ఇప్పుడువారి నాభాగముల నుండి తప్పించినచో మన కార్యముల యందు వారికింక అశ్రద్ధయు నుత్సాహమును ఉండవు. మనంతట మనమి వ్యవహారము నెన్నడును చక్కబెట్టుకొన జాలము. పని జరుగుటకు వారుండుట యవసరము. భాగస్థులుగాన మన లాభములో వారికి బాగముండుట వాస్తవమే కాని నష్టము వచ్చినను వారు కొంత భరింపవలయును గదా ! అట్లుగాక వారిని భాగస్థులుగా నుండుట మామాంపి