పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

మహర్షి దేవేంద్రనాధ్ ఠాకూర్ స్వీయ చరిత్రము


అతనితో నింటి ముందున్న వీధిలోనికి పోతిని, ఆతడ: ఛాయాపురుషు నివలె నుండెను. అతనిని స్పష్టముగా చూడ లేక పోతినిగాని అతడు నా కేది నియమించినను అది వెంటనే నెర వేర్చుటకు మాత్రము బద్ధుడ నైతిని. ఇక్కడనుండి అతడు ఊర్ధ్వముగ ఆకాశము వంక నెక్కెను. నేను నతని వెంటనే యాకస మెక్కితిని. ఇరు ప్రక్కలను గ్రహనక్షత్ర పుంజము. తారకా సమూహము నాదక్షిణమున, వామనమున, సమ్ము ఖమున, సముజ్వలమై యెల్లెడల కాంతులు వెదజల్లు చుండెను. వాని మధ్యనుండి నేను నడచు చుంటిని. నడువగా నడువగా మేమొక పొగ మంచుచే నావరింపబడితిమి. ఇంక నచట తారకలు, గ్రహములు సేమియు గాన రావయ్యెను. ఆపొగ మంచులో కొంత దూరము నడచిన పిమ్మట ఆమంచు సముద్రము నందలి యొక ద్వీపమువలె పూర్ణ చందుడు స్థిరముగా నిలచి యుండెను. దాని చెంత చేరిన కొలది చంద్ర బింబము వృద్ధి చెందు చుండెను. ఇకనది గోళాకారముగ నగప డుట లేదు. మన పృధివివ లెనే చదునుగా నుండెను. ఆ ఛాయా పురు షుడు వెళ్ళి ఆపృధివి యందు నిలబడెను. నేనునట్లే ఆపృధివి యందు నిలచితిని. ఆ భూమి యంతయు శ్వేతప్రస్తరము. ఒక తృణ మైనను లేదు. పుష్పములు లేవు, ఫలములు లేవు. ఆ నున్నని తెల్లని బయలు మా త్రము అన్ని వైపులకు వ్యాపించి యుండెను. దాని జ్యోత్స్న సూర్యు నివద్ద నుండి పొంద లేదు. తన కాంతితోనే తాను వెలుగు చుండెను. దానికి నాలుగు ప్రక్కలను వ్యాపించి యున్న మంచును భేదించి సూర్య రశ్మి చొర లేకుండెను. తననిజరశ్మి అతి స్నిగ్ధము. అచ్చటి వెలుతురు ఇక్కడ పట్టపగటి నీడను పోలియుండును. అచ్చటి వాయును సుఖ స్పర్శము.


ఈ బయలులో సంచరించి సంచరించి యందొక నగరము ప్రవేశించితిమి. ఇండ్లు, వీధులు సర్వము శ్వేత హస్తరముతో నిర్మింప