పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము.

71


మునకు తీసికొనివచ్చుటకు ప్రయత్నింపసాగెను. కలకత్తాలోనుండు ధనికులకును, దరిద్రులకును,జ్ఞానులకును, మాన్యులకును, ప్రతిమను జునకును బాహ్మధర్మము యొక్క ఏకృష్ణ మంగళ పథము చూపనారం భించెను. అంత స్వల్ప కాలములో నంతమంది బ్రహ్మధర్మము స్వీకరిం చుట కేవలమతని ప్రయత్నమూలముననే. ఇతడే నాకీ సంకట సమయము నందు, లోకులకుభయముజెందు పేల, లోక మెక్కువా? దైవమెక్కు వా?” అని అడిగెను. ఇతని మాటలు నాకు సాహసమును, ఉత్సాహమును పురికొల్పెను. నాహృదయములో బ్రహ్మాన్ని మరింత రగుల్కొనెను.


ఈయాలోచన యందును, శోచనయుదును నాకు రాత్రి బాగుగ నిదపట్ట లేదు. తండ్రి చనిపోవుట యొకటి, దానిలో దినమంతయు లౌకికముతో పరిశ్రమ, కష్టము, అటుపై నాయాంతరిక ధర్మయుద్ధము. ప్రపంచము జయించునా ధర్మము జయించునా ? ఎవ్వరు చెప్పజాలరు. ఇదియే నన్ను బాధించుచుండెను. నాదుర్బల హృదయమునకు బలము నిమ్ము. ఆశ్రయమునిమ్ము. అని యీశ్వరునిప్రార్థించుచుంటిని ఈసకలచింతనలతోను, శోచనలతోను నాకు రాత్రి నిద్ర లేకుండెను. ఈ బాలీసు ' పై నాతలదిమ్మెక్కి యుండెను. రాత్రియొక సారి నిదపట్టుచుండెడిది, తిరిగి మెలకున వచ్చుచుం డెడిది. నిద్రా జాగ్రదావస్థలసంధి స్థలములో నుంటిని. అట్టి సమయములో నాయంధ కారములో నెవరో యొకరు వచ్చి ' లే ' అనిరి. నేను లేచి కూర్చుంటిని. తిరిగి, “ పక్క మీదనుండి దిగు"అనిరి. పక్క మీదనుండి దిగితిని. నా వెను వెంట రమ్ము" అని అతడనెను. నేనతని వెను వెంటనే వెళ్లి తిని, అతడు గది చీడీలు దిగెను. నేనును అట్లే దిగితిని. అతనితో సావడిలోనికి వచ్చితిని. దేవిడీ ద్వారము వద్ద నిలచితిమి.దర్వానులు నిద్రించుచుండిరి. అతడు తలుపులు తాకెను. వెంటనే తలుపులు రెండును చివాలున తెరచుకొనెను


.