పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


మాత్రమునాకు సహాయుడై నాహృదయాంతరాళము నందుండు అభి పోయములనే పల్కెను. “ ప్రపంచమునకు భయపడెదవా ? నీ కేమి భయము? ఎవనికి భయపడినచో నన్యులవలన భయముండదో యాతనికి మాత్రము భయపడుము, ధర్మము కొరకు ప్రాణము నైన సమర్పిం పవలెను. ధర్మముముందు లోకనింద యెంతమాత్రపుది? ప్రాణములు పోయినను సరే మనము ధర్మమును మాత్రము వదలవద్దు.”


ఇతడెవరు? లాలా హజారిలాల్, ధర్మనిష్ఠయందును, సాహస మునందును బంగాళీల కన్న పశ్చిమ దేశ వాసులును, హిందూస్థానికులును ఘనులు. ఈసంకట సమయమున నేనతని పరిచయము పొందితిని. నాతో నతడు ఏకమనస్కుడును, ఏకహృదయుడునై నాస్వపక్షమున నిలబడి యుండెను, మాపితామహుడు బృందావనమునకు తీత్రయాత్ర వెళ్ళినప్పుడు హజారిలాలొక పితృమాతృహీన బాలుడుగా నుండుట చూచి తనతో మాయింటికి తీసికొని వచ్చెను. ముందు ముందు అతని జీవిత కళ్యాణము కొరకు ఏమి కావలసినను చెయ్యవచ్చుననీ ఆతని కాశ్రయమిచ్చెను. కాని అతనిషక్షమున దీనికిని విపరీతముసంభవించెను. అతడు కలకత్తాకు రాగానే నగరము యొక్క పాపస్రో తములో కొట్టుకొనిపోయెను. ఇతనని చూచువారెవరును లేకపోయిరి. ఇతనితో మాట్లాడువారెవరును లేక పోయిరి. దుస్సహవాసములో పడి అతని జీవితము పాపమయమై కళంక మయమైపోయెను. ఈదురవస్థ యందితడు ఈశ్వర ప్రసాదమువల్ల బాహ్మ సమాజమునందాశ్రయము పొందెను. బాహ్మధర్మము యొక్క బలము అతని హృదయమునం దవతీర్ణ మయ్యెను. అతడా బలముతో పాపస్రోతము నతిక్రమించి పుణ్య పదవి నారోహించెను. ఈ హజారిలాలే పిమ్మట బ్రాహధర్మ ప్రచా రకుడయ్యెను. ఎప్పుడతడు బాహ్మధర్మము స్వీకరించి కుటిల పాపముల నుండి నిష్కృతి చెందెనో అప్పటి నుండియు తాను ఇతరులనుకూడ పుణ్య పథ