పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము.


చేయజాలను. అట్లు చేసినచో ధర్మమునుండి పతితుడ నగుదును. కాని నేను చేసెడు శ్రాద్ధము మాత్రము సర్వశ్రేష్ఠమగు ఉపనిషత్తుల నను సరించియే యుండును. " అని నేను సవినయముగా ప్రత్యుత్తర మిచ్చితిని. అట్లు పనికి రాదు. అటు లైనచో శాద్ధము విధిపూర్వకముగ నుండదు. శిష్టాచారమునకు విరుద్ధమగును. నేను చెప్పినమాట వినుము. అంతయు సరిగా నుండును, ” అని ఆయన చెప్పెను.


నా రెండవతమ్ముడు గిరీంద్ర నాధునితో నేను,మన మెప్పుడు బాహ్ములమైతిమో అప్పటినుండి సాలగ్రామము తీసికొనినచ్చి శాద్ధము జరుప కూడదు. అట్లు చేసెః పక్షమున మనము బ్రాహ్ముల మెందుకయితిమి ? ప్రతిజ్ఞల నెందుకు గైకొంటిమి? " అని చెప్పితిని, వినమవదనుడై యాతడిట్లు ప్రత్యుత్తర మిచ్చెను: “అట్లయినచో మనలనందరు పరిత్యజంతురు. అందరు మనకు ప్రతిపక్షము వారగుదురు. మన సంసారమెట్లు జరుగును? మనమప్పుడు మహావిపత్తులలో పడిపోదుము.” దానికి నేను, “ఏమైనను సరే, విగ్రహారాధనను మాత్రము ఎంత మాత్రము అంగీకరింప జూలము,” అంటిని.


ఈవిషయములలోనే నెవ్వరి వద్దనుండి ప్రోత్సాహము పొందలేదు. నాప్రియసోదరుడే నాయుత్సహమును చల్లార్చెను. ప్రతివారును నాయభిప్రాయములకు విరోధులుగా నుండిరి. నేనందరను రసా తలమున ముంచి వేయుచున్నట్లు నాకువారు విరోధులైరి. నేను చేయు ఈయొక్క "కార్యమునుబట్టి అందరును జీవించిన యుండుటో నశించుటో సంభవించునని వారందరునభిప్రాయపడుచుండిరి. అందరునావల పక్షము, నేనొక్కడను ఒక పక్షము. ఎవ్వరును ఆశగలిగించుమాట ఒక్కటైనను పలుకకుండిరి.


ఈవిధముగ నేను నలుపక్కల కష్టములలో చిక్కుకొనియుండి నపుడాయసహాయ బంధుహీనావస్థలో నొక్క బ్రహ్మనిష్టాగరిష్టుడు