పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలికి పుట్టి, గాలిలో పెరిగి, గాలిలో నెగిరి పోవుచున్న నన్ను,

కన్న వారికన్న మిన్నగ, తన

అవ్యాజానురాగముతోను, అసమానమైత్రితోను

ప్రేమించి, ఆదరించి, ఉద్ధరించి, ఆశీర్వదించి,

నా జీవికమున కాదర్శమై, నా నేత్రముల కంజనమై, భయానకతరంగసంక్షుభిత ప్రజల ప్రవాహమున గభీరతర జంఝామారుతములో కొట్టుకొని పోవుచుండిన నాడు,

“భయమువలము! భయమువలదు! పొమ్ము, ముందుకుపొమ్ము!" *[1]

అని దేవదూతవ లే ఎలుగెత్తి హెచ్చరించి,

నా ఆత్మకు శాంతిని, చిత్తమునకు స్థైర్యమును పురికొల్పిన

గురువరుని షష్టిపూర్తి మహోత్సవమునకు,

కంటక దగ్గములయందును, సంకటస్థితులయందును, ఎక్క డెక్కడనో యెవ్వరునెరుగని ఏకాంతమునందు సంచరించుచున్న నేను

యాత్రికుడనై వచ్చి,

మాతృదేవతయొక్కయు, ఆచార్యదేవతయొక్కయు, పరమదైవముయొక్కయు

ఆశీర్వచన ప్రభావమున నేనాంధ్రీకరించిన

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రమును

మహర్షి వెంకటరత్నము

నాయుడు గారి

విమల చరణకమలములకు

కాన్కగా నర్పించుచున్నాడను.

రామమూర్తి

  1. 18వ పేజీ చూడుడు.