పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ ప్రకరణము.

43


త్సాహమును, అమితముగా గనబరచి నాడొక బ్రహ్మూత్సవమును గావించిరి. అరుణోదయముననే లేచి, మేమందరమును గూడి ఏకకంఠముతో ఎలుగెత్తి ఈశ్వరగీతములు పాడితిమి. పిమ్మట ఫలపుష్పశోభిత మైయున్న ఒక వృక్షచ్ఛాయ యందాసీనులమై హృదయపూర్వకము గా నీశ్వరునుపాసించి ఆత్మతుష్టి నిగాంచి పవిత్రులమైతిమి. ఉపాసనాం తమున రాఖాల్దాస్ హాల్దారు లేచి, “ఇపుడు మనమందరమును అద్వితీ యుడైన ఏకేశ్వరుని ఉపాసకులమైతిమి? గావున జూతి భేదములు మనలో లేకుండుట శ్రేయస్కరము, అలఖ్ నిరంజనో పాసకులగు 'శిఖ్కు- సాంప్రదాయులు జాతి భేదములను పరిత్యజించి, 'సింగ్ 'అను నామమును ప్రతివారును ధరించి ఒక్క జాతీవారగుటచే, ఢిల్లీచక్రవర్తి యగు ఔరంగజేబు పాదుషా వంటి నిర్విక్రపరాక్రమ శాలిని కూడ పరాజితుని జేసి, స్వతంత్ర రాజ్య స్థాపనస్థాపనమును కావించు కొనగలిగి నంతటి ఐకమత్యము ను పొందిరి. కావున మనమును మనయజ్ఞోపవీతములను త్యజించుట న్యాయము, ఉచితము అని అనెను. అతని తండ్రి యిదివిని నప్పుడు కత్తి తోవక్షమున పొడిచికొని ఆత్మహత్య కావించుకొనుట కుద్యుక్తుడయ్యెను.

పదవ ప్రకరణము.

రామమోహన రాయలు విధించినట్లు, బ్రాహ్ములు గాయత్రీ మంత్రోచ్చారము వల్లనే బ్రహ్మోపాసన చేయుదురని మొట్టమొదట నేనను కొంటిని, గాని క్రమముగా ఆయుద్దేశమును విడిచి పెట్టవలసి వచ్చెను. ఈమంత్రము యొక్క అర్ధము గ్రహించుటకు అనేకులకు కష్టతరముగా నుండెను. కావున దీనిని ఉపాసనలో ఒక అంగముగా నుపయోగించుటకు అను కూలముగ లేక పోయెను. అర్థ సహితముగ