పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

మహర్షి దేవేంద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


రించిరి, తత్వబోధినీ సభ బయలు దేరదీసిన దినము ఎప్పటికిని మరుపున కు 'రావలసినది కాదని చెప్పియుంటిని. అట్లే బాహ్మధర్మమును మే మందరమును స్వీకరించిన ఈదినముకూడ యొక మమా దినము, 1899 సంవత్సరమున ఈశ్వరునియందు ఆధారపడుట ఆరంభము చేసి, నేటికి బాహ్మమతములోనికిని దానితో బాటు నవజీవనము లోనికిని ప్రవేశిం చునంతవరకును వచ్చితిమి గదాయని యిప్పుడు మాయుత్సాహమున కును ఆనందమునకును మేర లేకుండెను.


సమాజ చరిత్రలో నితకుమున్నెన్నడును జరిగి యుండలేదు. ఇంతవరకు బాహ్మ సమాజమని ఒక పేరు మాత్రముండెనని చెప్పవచ్చును. గాని ఇప్పుడు బ్రాహ్మధర్మము బయలు దేరినది.బ్రహ్మ లేనిదే ధర్మము నిలువదు; ధర్మము లేనిదే బ్రాహ్మను పొంద నేరము. ఈ సంబంధమును గ్రహించి బాహ్మమతమును స్వీకరించి, బాహ్మూలమై బాహ్మసమాజ నామమును సార్థక పరచితిమి. 1845 సం|| రం! లో అయిదువందల మంది, దీక్షను స్వీకరించి 'బాహ్ములుగా చేరిరి.సాధారణముగా సోదరులలోనుండు అన్యోన్య ప్రేమను మించిన ప్రేమనాడు బ్రాహ్ములలో ఒక రియెడల ఒక రికియుం డెడిది. బ్రాహ్ములలో నీసౌహార్ద్రమునుజూచి పరమానంద భరితుడనైతిని. పట్టణము వెలుపల ఒక ప్రశాంత స్థలమున వీరందరికీ ఒక సమ్మేళనము ఏర్పర చిన బాగుండునని తోచెను. అక్కడ అందరును కలసి స్నేహభావ మభివృద్ధి చేసికొని, ధర్మవిషయమై యభి ప్రాయముల మార్చి కొనుటకు వీలగును. ఈ యుద్దేశముతో 1895 సం||రం లో పుష్య సప్తమినాడు"పొల్టా" నది కెదురుగనున్న “గోరితి” లోని మాయుద్యానవనగృహమునకు వీరందరిని ఆహ్వానముచేసితిని.


ఏడెనిమిది పడవలను కుదిర్చి వీరందరిని కలకత్తా నుండి తోటకు తీసికొని వెళ్ళితిని, వారందరును సద్భావమును, అనురాగమును, ఉ