పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

మహర్షి "దేవేంద్రనాధ శాకూర్ స్వీయచరిత్రము.


మరల్పజాలదు ఈశ్వరునుండి. విద్యా వాగీశుడు మాత్రము భయపడి నాతో, “ మీతండ్రిగారు దీనికిష్టపడుట లేదుగావున నీకింక పాఠము లను చెప్పజాలను.అనెను. అందు పైని అతనితో " మాయింటి కిరానక్కర లేదు కాని, ముదాయంత్రము లోనికి వచ్చి చెప్పుచుండు మం” టిని. అతడట్లే చేయు చుండెను. ఇది విద్యా వాగీశుని మీదను నామీదను మాతండ్రిగారి కోపమునకు కారణము.


బాహ్మసమాజమును ప్రధమమున చూచినప్పుడు, శూద్రులు వినకుండ వేదములు ప్రత్యేకముగా వేరొక గదిలో చదువబడు చుండెను. నాకిది చాల కష్టముగా తోచెను. బాహ సమాజోద్దేశము బ్రహ్మోపాసన ప్రజలలో వ్యాపింప జేయుటయే. జూతి భేదములు లేకుండ బ్యహ్మోపాసన చేయవలెనని " ట్రస్టుడీడ్ ' (Trust Deed) లో చెప్పబడియున్నది. కానీ ఈవిపరీతన్య వహారమును ] చూడగా నాకుమిక్కిలి దుఃఖమువచ్చెను. మరియొక సారి ఏమిజరిగెననగా, రామ చంద్యవిద్యావాగీశుని సహోద్యోగియగు ఈశ్వరచంద్రన్యాయరన్న బ్రహ్మ సమాజ వేదిక నుండి శ్రీ రాముడు అవతార పురుషుడని సిద్ధాంతము చేయుటకు ప్రయత్నించు చుండెను. ఇది బ్రహ ధర్మమునకు కేవలము విరుద్ధ బోధగానున్నట్లు నాకుతోచెను. వీటికి ప్రతివీధానము చేయుటకుగాను వేదములు బహిరంగముగ చదువుట కేర్పా టుచేసి, వేదిక పైనుండి అవతార వాదవర్ణనలు చేయుట నివారణచేసితిని. అరోజులలో వేదములు చదువగలిగినవారు బ్రాహ్మధర్మోపదేశములు చేయగలిగినవారు బహుస్వల్పముగా నుండిరి. కావున సంస్కృతభాషయం దొక పరీక్ష గావింతుమనియు, దానిలో నుత్తీర్లు లైనవారు“తత్వబోధినీ” సభయందు చేర్ప బడురనియు, శివాలాభమునకు విద్యావేతనము లివ్వ బడుననియు " తత్వబోధినీ ' పతిక యందు ప్రకటించితిని, పగిగా నియమిత దినమున అయిదారుగురు వచ్చి విద్యా --