పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

13

స్కృత భాషలో విశేష్య మొక్కచోటను విశేషణము మరియొక చోటనుండెను. దీనిని గ్రహించుటకు కొంత కాలము పట్టెను. మహాభారతములో అనేకాంశములను చదివితిని. ధౌమ్యఋషి ఉపాఖ్యానములోనుపమన్యుని గురుభక్తి నాకు బాగుగ జ్ఞాపకమున్నది. ఈ మహాగ్రంధమిప్పుడు భాషాతగీకరింప బడుటచే అనేకులచే పఠింప బడుచున్నది. కాని ఆదినములలో మూలగ్రంధము బహుకొలది మంది మాత్రము చదువుచుండిరి. ధర్మపిపాస నన్ను దానిని చాలవరకు చదువ పురి కొల్పినది.


తత్యాన్వేషణకొరకు సంసృతము చదివినట్లే ఆంగ్లేయ భాషను చదువుచుంటిని. పాశ్చాత్య ధర్మశాస్త్రము సవిస్తరముగా " చదివితిని. కానీ ఎన్ని చేసినను మనసునందలి అభావము తొలగకుండెను. ఆవిషాదము, అంధ కారము,మన శాంతి హృదయమును మిక్కిలి పీడించుచుండెను. 'ప్రకృతికి లోబడుటకేనా మాననుడు సృజింపబడినది.” అని ప్రశ్నించు కొంటిని. అయినచో మనుజునికి దిక్కులేదు. ఈ ప్రకృతి పిశాచము యొక్క పరాక్రమము దుర్నివారము. స్పర్శమాత్రమున అగ్ని సమస్తమును భస్మీపటలము గావించును. ఓడమీద సముద్రము పై ప్రయాణము చేయ నారంభించితివా? సుడిగుండములు నిన్ను పాతాళ మునకు లాగి వేయును. జంఝామారుతములు నిన్ను దరిలేని దుఃఖాబ్ది లోనికి తరిమి వేయును. ఈ ప్రకృతి పిశాచముయొక్క పట్టును వదలించుకొనుట ఎవ్వరికిని సాధ్యముకాదు. దాని యాజ్ఞలకు శిరమువంచి నమస్కరించుటకే మనము బ్రతుకు చుండినచో మనకాశలేదు, ఇక దేవి నభిలషింపగలము ? దేనిని నమ్మగలము ? సూర్యకిరణములవల్ల ఛాయాగ్రాహకయంత్రము ( Photograph ) నందద్దముపై వస్తువు లెట్లు ప్రతిబింబి పబడునో, అట్లు వివిధ ఇంద్రియముల ద్వారా మనసునందు బాహ్య విషయముల స్వరూపములు గోచరములగుచున్నవి. దీనినే జ్ఞాన