పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితోమ్మిదవ ప్రకరణము.

213



రాంపూర్, బోఆలియా, సమీపించుచుండగా ధూమమేఘములను గక్కుచు ఒక స్టీమరు వచ్చుచుండెను.దాని చూచి కెప్టనుమా స్టీమరు ఆపెను. వచ్చుచుండిన స్టీమరు కూడ ఆగెను. రెండు స్టీమర్లును అక్కడ లంగరు వేసెను. ఉగ్యోగులును, స్త్రీలును ఆస్టీమరుచాల చిన్నది గావున తమకందరకు స్థానముండదని గాంచిరి. పురుషు లెట్లయినను, పై భాగమున సర్దుకొందురు, కాని స్త్రీ లేమి చేతురు? కెప్టను సామాను పడవలో నున్న మిలిటరీ సర్జన్ మొదలగు పురుషులందరి పద్దకు వెళ్లి వారి గదు లిమ్మని కోరెను. మిలిటరీ సర్జను కొంచెము స్పష్ట నాది. ఆయన యిట్ల నెను. " నేనీ రీతిగా స్త్రీలను సంతోష పెట్టుటక నేక సార్లు గదులు విడిచి పెట్టితిని, కాని వారి వద్ద నుండి ఒక్క “వందన” మన్నమాటనైనను పొందియుండ లేదు.” పురుషు లెవ్వరును స్త్రీలకు గదుల నివ్వకుండుటచే చిట్ట చివరకు కేష్టను నావద్దకు వచ్చి, “స్త్రీలకు తావు లేదు. మిగది విడువ గలిగినచో వారు మిక్కిలి కృతజ్ఞులయి దురు” అనెను. నే నతిఆహ్లాద సహితముగ నాగది వారికొరకు ఖాళీ చేసితిని. కెప్టన్ అందుకు మిక్కిలి సంతుష్టాంతరంగుడై “ఆంగ్లేయులు తమ దేశీయులైన స్త్రీలకు సహితము స్థానమివ్వ లేదు. మీరెంత ఉదార భావముతో వారికొరకు మిగది విడిచియిచ్చిరి ! ఇందులకు మేమందరము మీయెడల విశేషకృతజ్ఞత కలిగి యుందుము.” గది విడిచి నందుకు నా కే కష్టము కలుగ లేదు. స్టీమరు పై భాగమున సుఖముగా నుండుటకు కెప్టన్ 'మొదలయిన వారందరు కలసి చక్కని ఏర్పాటులు గావించిరి. నేనచ్చట ముక్త వాయువులో సుఖనిద్ర, ననుభమిచితిని. రాంపురమందు స్టీమరు మార్చుటకును ఇతర యేర్పాటులు గావించుట కును కొంతయాల స్యముండును. గావున నేవచ్చు సమాచారము చెప్పుట కుగాను ముందుగా ' కిశోరి' నొక డింగీమీద గృహమున కంపితివి.