పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్' స్వీయచరిత్రము.


'

కొవున్న వారందరు కలిసి యోచించి సామాను పడవను ఆ స్థానము నందే విడిచి పెట్ట వలయునను అర్థము టెలిగా గ్రాములో లేదని స్థిరపర్చి ఆ రెండవ స్టీమరు కలుసుకొని నప్పుడు సామాను పడవ నిచ్చి వెనుక కప్పుడు వెళ్ళ వచ్చునని నిర్ధారణ చేసిరి. ఈలోగా కలకత్తా చేరినను చేరవచ్చును. ఈ ఆలోచనకు కెప్టను ఒప్పుకొ నెను. కలకత్తా నైపునకు స్టీమరు తిరిగి బయలు దేరెను.


స్టీమకులో పోవుచుండగా మార్గమున, నా కనిష్ట సోదరుడైన నాగేంద్ర నాధుని మరణవార్త వింటిని. ఈవార్త వల్ల శోకావిష్ట హృద యుడనై, అన్యమనస్కుడనై యేదో వస్తును తెచ్చుటకు స్టీమరు పై నుండి దిగి గదిలో ప్రవేశించితిని, ఆనస్తుపు తీసుకొని తొందరగా గది బైటకు రాగా నా పొద మానుకొనుటకుస్థానము దొరక లేదు. నేను 'వెంటనే రెండవ అడుగు పెట్టకుండగ నే వెనుకకు వాలి గదిలో బడితిని, కళాసులు హాహారవముల... -పరుగు పరుగున నచ్చి నా పొద మొకటి స్టీమరుయొక్క, అధోభాగమున కుండు కన్నములోను మిగిలిన శరీరము గదిలో'ను పడియుండుట గాంచిరి. "సామానులు దింపుటకుగాను గది ముందున్న బల్లలు తీసి వేసితిమన్న సంగతి మీరెరుగరా?” అనిరి. నే సది చూడ లేదు. పూర్వమువలెనే దారి సరిగానున్న దనుకొంటిని. నేనిం కొక అడుగు పెట్టిన యెడల యేబదిమూరలు కిందికి బడి యుందును. నాతల బద్దలై చూర్ణమైయుండును. ఆదినమునా ప్రాణములు దక్కెను. కాని

“ప్రపంచచోరుడు నిద్రించి యుండ లేదు. అతని బారినుండి సుర క్షితుడనై యున్నావని తలంపకుము. ఈదినమతడు దొంగిలింపక పోయిచో మయెక దినమున దొంగిలించును *[1]


t

  1. హనే జహర్ : ఖ ప ఆ స్త్రీ మ సా వివ. అదో ! అగర్ ఇయ్రోజ్ : నబ్రుదా స్త కెఫర్దా బబురద్ "హ ఫీజ్ ”