పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

మహర్షి దేవేంద్రనాధ నాకూర్ స్వీయచరిత్రము



. యుండెను. ఉదయమున నే 6 గంటలకు బండి వెళ్ళునని వింటిని, నేను తెల్ల వారు జాముననే లేచి కొంచెము తేనీరు పానము చేసి త్వర త్వరగా స్టేషనుకు వెళ్ళితిని. 7 గంటలయినది. కిశోరి స్టేషన్" వద్ద నుండి తిరిగి వచ్చెను. టిక్కట్లు దొరకవని చెప్పెను.“ నేడు రైలులో గాయములుచెందిన సైనికులు పోవుచున్నారు. ఇతరులకు జాగా లేదు,” అనెను “ నేను స్వయముగ ననుసంధానము చేయుటకు స్టేషనులోనికి ప్రవేశించితిని. ఒక బంగాళీ స్టేషను మాష్టరు నన్ను చూచి ఒహో, తమరా!!” అని రైలునాపి, “ఇంకా ఎవ్వరో అనుకొంటిని, " తమకు నేను టీక్కెట్టు యిచ్చెదను. బండి ఆపి మిమ్ములను రైలు ఎక్కించుటకు నాకధి కారమున్నది. నేను నూ తత్వబోధినీ పాఠశాల యొక్క పురాతన శిష్యుడను. పరీక్షలలో నన్ను చాల సారులు తమరు పురస్కరించిరి. నా పేరు దీననాధ్ అని చెప్పెను

. నాకతడొక టిక్కట్టునిచ్చెను. నేను కెప్టెన్" సాహేబులతో బాటు, ప్రధమతరగతి బండిలో నెక్కి కాన్ పూర్ విడచితిని. 3 గంటలకు అలహా దాదు చేరితిని. అప్పటికి అక్కడ స్టేషను నిర్మింపబడియుడ లేదు. మార్గ మధ్యమున ఒక రోడ్డు వద్ద బండి నిలచెను. మేము దిగి నడిచిపోతిమి. మూఫుకోసులు దూరము పోయిన పిమ్మట అలహా బాదు డాక్ బంగాళా చేరితిమి. అక్కడ గదులన్నియు మనుష్యులతో నిండియుండెను. నాకక్కడ స్థానము దొరక లేదు. నావద్ద నొక కుర్చీ యుండెను. నేనొక చెట్టుకింద నాసామానుంచుకొని ఆకుర్చీపై కూర్చుంటిని. కిశోరి డాక్ బంగాళా పద్దనుండి నాకొక కూజాతో జలము తెచ్చెను. నేను కిశోరి, ఈ “ఊరి లోనికి వెళ్ళి నాకొక యిల్లు కుదిర్చి నన్నిక్కడనుండి గొంపోవుము. గృహము లోనికి ప్రవేశించకుండ మంచినీళ్లనను స్పృశింపను,” అంటిని. కిశోరి "వెళ్లెను. తర్వాత కొంచె ము సేపటికి ఒక బండి వచ్చియుండెను. మెడకు బట్టలు చుట్టుకొని