పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది ఎనిమిదవ ప్రకరణము.

207


ఇక్కడనుండి అంబాల పెళ్లి అక్కడ ఒక గుర్రపు బండి అద్దెకు తీసికొంటిని. దానిపై రాత్రింబవళ్ళు ప్రయాణము గావింప నారంభించితిని. రాత్రులు జ్యోతిష్మయుమునై యుండెను. ఆక సమున శగత్కాల చంద్రబింబము వికసికతమై యుండెను. సస్య క్షేత్రముల నుండి శీతల మారుతములు వీచుచుండెసు. బండిలో నుండి బయటకు చూడగా కొందరు గుర్రపు రౌతులు నా బండి ప్రక్కను స్వారి చేయు చుండుట గాంచితిని. విద్రోహుల భయముచే గవర్నమెంటు వారు ప్రయాణస్థుల క్షేమముకొరకు రాత్రి వేళ బండ్లతో గుర్రపు రౌతులు స్వారి చేయునట్లు నియమించిరి. దీనిని బట్టి నేను మార్గమునందలి అపాయములను తెలిసికొని కొంచము భయము జెందితిని. మట్టమధ్యాహ్నము వేళ కాన్పూరు. ప్రాంతమున ఒక స్థానమునకు గుర్రముల బదలాయించుటకు గాను నా బండి యాగెను. అక్కడ నొక పొలములో ,ననేక గుడారములు వేయబడి యుండెను. జనులు యుండిరి. అక్కడ ఒక బజారు పెట్టబడి యుంనెను. కొంచెము ఆహా రము కొరకు కిశోరి నచటకు పంపితిని. అతడక్కడనుండి నాకు గేదె పాలు తెచ్చి యిచ్చెను.ఇది యేమి బజారిక్కడ?" అని అడిగితిని. . ఆతడు ఢిల్లీ ఫాదుషాను ఖయిదీగా పట్టుకొని పోవుచున్నారు. అది ఈ బజారు పెట్టిన కారణము," అనెను. నేను సీమ్లాకు పోపు నప్పుడు ఈతడు యమునాతీరమున హాయిగ గాలి పడగ లెగురవైచుకొను చుండెను.ఇప్పుడు నేను తిరిగి వచ్చు సమయమున నీతను బంధింప బడి కాగారమునకు గొంపోవబడుట గాచితిని. ఈక్షణభంగుర మైన దఃఖమయ ప్రపంచమునందు ఎవరి భాగ్యమునకు ఎప్పుడేమి ఘటించునో ఎవరు చెప్పగలరు !

సిమ్లా నుండి విపత్సంకూలమైన అతి దీర్ఘ పథము నత్రికమించి కాన్ పూర్ చేరి తిని. అప్పుడిక్కడనుండి రైలుమార్గము తెరువబడి