పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


బలీయమయ్యెను. మార్గమున నింకయు ననేక భయములుండెను. అక్కడక్కడ విద్రోహ దళములు దాగియుండెను. కాని ఆభయము లకు నా మనసున స్థానమీయ లేదు. నదీ ప్రవాహ మేవిధముగ నప్రతి హత వేగమున ప్రస్తారాటంకముల సరకుగొనక నిరాఘాటముగ దొర్లి పోవుచున్నదో నదేవిధమున నేనును ఏ యాటంకములసరకు గొన లేదు.


కార్తిక శుద్ధ పాడ్యమినాడు * [1](విజయదశమి) సీమ్లా బజారువీధియందు నా సనారి, డోలి, గుర్రము, సర్వము సిద్ధసిదముగనుండెను.నాస్వ దేశీయులును, మిత్రులును అతి దుఃఖముతో నన్ను సాగనంపు టకు నాచుట్టును జేరియుండిరి.అందరివద్ద సెలవు గైకొని సవారి యెక్కి బయలు దేరితిని, విజయదశమినాడు సిమ్లా నన్ను విసర్జన చేసెను. కొండదిగుట అతిసులభము. త్వరలోనే పర్వత పాదమున నున్న కాల్కా (kalka) చేరితిని. రాత్రి గడచి పోయేను. ప్రభాతమున శోభామయమగు సూర్యోదయమును చూచితిని. దానితోనా మనస్సు ఉజ్జ్వలమయ్యెను. పిమ్మట కాల్కా వదలి పొంజో వచ్చితిని. ఇక్కడ నొకతట్టలో కొన్ని ఘన చిత్రముల గాంచితిని. అందువందల కొలది ఊటలనుండి జలధార లెగిరి పడుచుండెను. అవన్నియు సవజీవనము నొందినట్లు మహోల్లాసముతో జలము నుదీర్ఘ ముగావించుచుండెను, వాటి యనవరత సృష్టిచే నవి వర్ష ఋతువు ననుకరించుచుండెను. ఇట్టి సుందరములగు నీటి యూటల నిదివరలో నే నెన్నడు గాంచలేదు.


  • వంగ దేశ వాసులు సూర్య సిద్దాంతేమునవలంబింతురు. కావున వారి కార్తీక సుద్ద పాడ్యమి మన చాంద్ర మాస రీతిని విజయదశమి యగును. ఇంతకు ముంన్ను బ్రాయబడిన తిధులు గూడ వారి సాంప్రదాయము నను7సరించియే వ్రాయబడినవి.