పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది ఎనిమిదవ ప్రకరణము.

205

-


భయపడితిని. షికారు వెళ్ళిన బాగుండు నేమోయని బయటకు పోతిని. చాలదూరము నడచితిని. సూర్యుడు దయిం చెను. గృహమునకు తిరిగి వచ్చితిని. అయినను నాహృదయము కొట్టుకొనుట మానలేదు, అప్పుడు కిశోరిని పిలచి, కిశోరీ, నేనింక సిమ్లాలో నుండను. సవారి రప్పింపుము ” అంటిని. ఈమాటలు చెప్పుచుండగా నాహృద యకంపము ఆగిపోయెను. అయినచో ఇదియేనా నాకౌషధము? నేనాదినమంతయు నింటికీ పోవుటకు స్వయముగ నుద్యుక్తుడ నై వలయు. నేర్పాటుల గావించు కొన నారంభించితిని. దీని వల్ల విరామము నొందితిని. నా హృదయ కంపము పూర్తిగా ఆగిపోయెను, నేను స్వస్థత జెందితిని.


నే నింటికి పోవలెనని యీశ్వరా దేశము. ఈ ఉద్దేశమునకు విరుద్ధముగ మనుష్యని ఇచ్ఛ వ్యవహరింప గలదా? ఈ ఆ దేశమునకు కొంచము విరుద్ధముగ నుద్దేశించు సరికి నాశరీర ప్రకృతియు నాకు విరుద్దముగ నిలబడినది. అంత బలీయ మాయన యాజ్ఞ ! " అంతరము నందలి ఆ సర్వశక్తి వంతము. బాహ్యము నందలిది కేవలశుష్కము. " * [1] నేనింక సిమ్లాలో నుండగలనా ? నాయింద్రియములప్పుడు నాతో నిట్లను చుండెను: ఈ రెండు వత్సరములనుండియుమా కెంతకష్టము నిచ్చితివి ! ఎంత సాధ్యసాధనల గావించినను, మానీర్ఘోష ప్రవృత్తుల ఒకటినైన సంతుష్టి చెదింప నైతివి. ఇప్పుడు మేమింక దుర్బలులమై పోతిమి. ఇంక నీశుశ్రూష చేయజాలము.” నాశరీరము దుర్బలమునను సరే, సబలమైనను సరే. నేనింక సిమ్లాలో నెట్లండగలను ? ఆయన చిత్తమే నాశాసనము. ఆయన యిచ్ఛతోనాయిచ్ఛను మిళితము చేసి ఇంటికి పోవుటకు సిద్ధపడితిని. నామనస్సు

--


  • *
  • హుకుం అందల్ సబ్ కోయ్ ! బహార్ హుకుం -నకోయ్ .." ||