పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది ఎనిమిదవ ప్రకరణము.

203


మువరకు నాహృదయమునందు నాటుకొనియుండెను. నేనెప్పుడు ఏకష్టములలో పడినను ఆ నేత్రములు నాకుగన్పట్టు చుండును.

ముప్పది ఎనిమిదవ ప్రకరణము..

మరియొక సారి శ్రావణ భాద్రముల మేఘముల యొక్క-యు విద్యుల్లతల యొక్క-యు ఆడంబరము ప్రాచుర్భూత మయ్యెను. నిరంతర ధారావృప్తి పర్వతముల సమాకూలము చేసెను. ఆ యక్షయ పురుషుని శాసనమువల్ల పక్షములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, యధావిధిగా సంచరించు చుండును. ఆయన శాసనముల నెవ్వరు నతి క్రమింప నేరరు. ఈ సమయమున నేను కండరముల యుందును, నదీ ప్రసవణముల నవనవ విచిత్ర శోభనుచూచుచును సంచరించు చుంటిని. ఈవర్ష కాలము నందిక్కడి నదులు వేగమువల్ల మహాశిలలు సహితము ప్రవాహమునందు కొట్టుకొని పోవుచుండును. ఏవియును వీని ప్రమత్త వేగము నాటంక పరుప లేవు. ఏవైనను వీనికన్లు వచ్చిన యెడల నది వానీని మహాశక్తిచే దూరముగావించి బద్దలుకొట్టును.


ఆశ్వయు జమాసము నందోక నాడు కొండ క్రిందుగా ఒక నది సేతువు పైన నిలబడి దాని స్త్రోతము యొక్క అప్రతిహతగతియు, ఉల్లాసమయ మైన సుడిగుండములను చూచి చూచి విస్మయ నిమగ్నుడనై తిని. ఆహా ! ఇక్కడ యీనది ఎంత నిర్మలముగను శుభముగను ఉన్నది ! దీనిజల మెంత స్వాభావిక పవిత్రతను, శీతలతను కలిగి యున్నది ! ఎందులకిది తన పవిత్ర భావమును పరిత్యజించుటకు క్రింది కంత వేగముతో ధావమానమగు చున్నది. ఈనది ఎంతకిందికి వెళ్ళునో అంత విస్తారముగ నీపృధివి యొక్క క్లేదమును, ఆవర్జనమును