పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్ స్వీయచరిత్రము.



ధరించి షికారు చేయుట యందలి మహారహస్యమును నా దేశీయులగు వంగ దేశీయు లెట్లెరుగ గలరు ? 'నేనొక్కక్కప్పుడు ఒక నిర్జన పర్వత పార్శ్వమున నొక శిలాతలమున కూర్చుండి ధ్యానమునందు మగ్నుడ నై ఒక్క పూట అంతయు గూడ నట్లే గడపువాడను.

ఒక నాట్లు సంచరించుచుండగా ఒక వనాకీర్ణ పర్వతము మధ్య నుండి యొక దారి కనబడెను. ఆ దారిని బట్టి నడవ సాగితిని. అప్పుడు మధ్యాహ్నము నాలుగుగంట లయినది.నేను తదేక మనస్కుడనై అట్లే ఆగకుండ నడువనారంభిచితిని. అడుగుమీద అడుగు పడుచుండెను; గాని నాకది తెలియ లేను.నే నెక్కడికి వెళ్ళుచుంటినో, ఎంత దూరమువచ్చితినో, ఇంక సెంత దూరము వెళ్ళుదునో, ఏమియు గమనించ లేదు. చాల సేపై నపిమ్మట ఒక పథికుడు నా కెదురుకుగ నచ్చెను. అందువల్ల నాధ్యానము భగమైపోయెను. వ్యక్తి వచ్చెను. అప్పటికి సంధ్యా కాలముయ్యెను. సూర్యుడస్తమించెను. నాకు తిరిగి స్మరణ వచ్చెను. ఈవచ్చిన దూరమంతయు తిరిగి వెనుకకు పోవలయును గదా! థ్రుత వేగముతో వెనుకకు మరలితిని. చీకటికూడ థ్రుత వేగముతో వచ్చి నన్నా వరించెను. గిరి, వనము, కాసనము, సర్వము అంధ కారము తో ఆచ్ఛన్నము గావింపబడెను. ఆయంధ కారమునందొక దీపము వలె నర్ధచంద్రుడు నావెను వెంట రాసాగెను. ఏదిక్కు నుండియు ఏశబ్దమును వినబడుచుండుట లేదు. కేవలము నాయడుగుల ధ్వని మాత్రము మార్గము నందలి శుష్క పత్రముల పై బడబడ లాడసాగెను. భయముతోపాటు నామనస్సు నందొక గంభీర భావ ముదయించెను. రోమాంచితశరీరుడ నై అవనమధ్యమున నీశ్వరుని నేత్రముల గాంచితిని.ఆయన అనిమేషదృష్టి నాపై ప్రసరింపబడి యుండెను, ఈ సంకటపథము నందాతని చక్షువులే నాకు నేతలయ్యెను. నానాభయముల మధ్య నిర్భీతుడనై రాతి 8 గంటలకు ఇల్లు చేరితిని. ఈశ్వరుని యీదృష్టి చిర కాల